...
...
Next Story

TGPSC AEE Hall Tickets : ఏఈఈ హాల్ టికెట్లు విడుదల - లైవ్‌ ఫొటో తప్పనిసరి..!

TGPSC AEE Civil Hall Tickets : టీజీపీఎస్సీ ఏఈఈ (సివిల్) ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. నవంబర్ 5 వరకు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది.

Published on: Nov 3, 2026, 13:06:38 IST
Advertisement

TGPSC AEE Civil Hall Tickets : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) రిక్రూట్‌మెంట్ పరీక్షకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు… హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TGPSC AEE సివిల్ హాల్ టికెట్లు విడుదల
TGPSC AEE సివిల్ హాల్ టికెట్లు విడుదల

ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు నవంబర్ 5, 2026 రాత్రి 11:59 గంటల వరకు తమ హాల్ టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని కమిషన్ స్పష్టం చేసింది. చివరి నిమిషం దాకా వేచి చూడకుండా వెంటనే పొందాలని పేర్కొంది.

లైవ్ ఫోటో సమర్పణ తప్పనిసరి

ఈసారి హాల్ టికెట్ డౌన్‌లోడ్ ప్రక్రియలో కమిషన్ ఒక ముఖ్యమైన నిబంధనను పొందుపరిచింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకునే సమయంలో తాజా ప్రత్యక్ష ఛాయాచిత్రాన్ని (Live Photo) సిస్టమ్ ద్వారా సమర్పించడం (సబ్మిట్ చేయడం) తప్పనిసరి. ఆన్‌లైన్ వెబ్‌క్యామ్ లేదా డివైజ్ కెమెరా ద్వారా ఈ లైవ్ ఫోటోను క్యాప్చర్ చేసి అప్‌లోడ్ చేసిన తర్వాతే హాల్ టికెట్ ప్రింట్ తీసుకోవడానికి వీలవుతుంది.

చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు, నెట్‌వర్క్ రద్దీ (సర్వర్ బిజీ) వంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి అభ్యర్థులు ముందే తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష కేంద్రం వివరాలు, పరీక్ష సమయం, నిబంధనలను హాల్ టికెట్‌పై క్షుణ్ణంగా సరిచూసుకోవాలని స్పష్టం చేశారు.

హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే విధానం:

  • ముందుగా టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://tgpsc.gov.in ను సందర్శించాలి.
  • హోమ్‌పేజీలో కనిపించే "AEE (Civil) Hall Ticket Download" లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అభ్యర్థి తన టీఎస్‌పీఎస్సీ ఐడీ (TSPSC ID) మరియు పుట్టిన తేదీ (Date of Birth) వివరాలను నమోదు చేయాలి.
  • స్క్రీన్‌పై సూచించిన విధంగా ప్రత్యక్ష ఛాయాచిత్రాన్ని (Live Photo) సబ్‌మిట్ చేయాలి.
  • వివరాలు సరిచూసుకున్న తర్వాత హాల్ టికెట్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.
  • డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్‌ఔట్ తీసి పెట్టుకోవాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks