మేడారం జాతరకు నేటి నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల నుంచి 4 వేల ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
- మేడారంలో 50 ఎకరాల్లో తాత్కాలిక బస్ స్టాండ్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. దీన్ని రాష్ట్ర ఆర్టీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ప్రారంభించారు.
- తాత్కాలిక బస్ స్టాండ్ లో 50 క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
- 25.76 ఎకరాలల్లో 1000 బస్సులు పార్కింగ్ చేయవచ్చు.
- 10,441 సిబ్బంది విధుల్లో ఉంటారు.
- 76 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా…. కమాండ్ కంట్రోల్ రూమ్ తో అనుసంధానం చేయబడి ఉంటాయి.
- మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది.
- తాత్కాలిక బస్ స్టాండ్ లో తాగునీరు, టాయిలెట్స్, మెడికల్ క్యాంప్ అందుబాటులో ఉంటాయి.
ఆర్టీసీ సేవలను వినియోగించుకోండి - మంత్రి పొన్నం

తాత్కాలిక బస్ స్టాండ్ ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…. మేడారం జాతరకు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో 4,000 ఆర్టీసీ బస్సులను ప్రణాళికబద్ధంగా నడుపుతామని చెప్పారు. అవసరాన్ని బట్టి మరిన్ని బస్సులు కూడా వెంటనే పెంచే విధంగా శాఖ సిద్ధంగా ఉందన్నారు.
ప్రయాణికులకు రవాణా సేవలతో పాటు భద్రత, ఆరోగ్య సహాయం వంటి అంశాల్లో కూడా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తులు తమ ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా పూర్తి చేసుకోవాలంటే తప్పనిసరిగా RTC బస్సులనే వినియోగించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. స్వంత వాహనాలతో వస్తే దూరంగా పార్కింగ్, ఎక్కువ నడక వంటి ఇబ్బందులు తప్పవని, RTC బస్సులు గద్దెలకు సమీపంలోనే దించుతాయని తెలిపారు. ఆర్టీసీ ప్రయాణం భద్రతాపరంగా మరింత నమ్మదగినదని అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… 2024లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతరకు రవాణా మౌలిక వసతులు కల్పించాలనే దూరదృష్టితో ముందడుగు వేశారని గుర్తు చేశారు. ప్రతి జాతర సమయంలో తాత్కాలిక ఏర్పాట్లతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, దీర్ఘకాలిక పరిష్కారంగా శాశ్వత ఆర్.టి.సి. బస్‌స్టాండ్‌ను ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని తెలిపారు. భక్తులు, ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యాలు ఎదుర్కోకుండా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
రూ.7 కోట్ల వ్యయంతో ఏటూరునాగారంలో RTC బస్ డిపోను మంజూరు చేయడం జరిగిందని మంత్రి సీతక్క తెలిపారు. ఏటూరునాగారంలో డిపో ఏర్పాటు చేస్తే అటవీ ప్రాంతాలు, భద్రాచలం, మంగపేట, వాజేడు, వెంకటాపురం వంటి ప్రాంతాలన్నీ సమగ్రంగా కవర్ అవుతాయని స్పష్టం చేశారు. అందుకే ఏటూరునాగారమే అనుకూల ప్రాంతమని సూచించగా… ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అలాగే మంగపేట, ములుగు తదితర మండలాల్లో మినీ బస్స్టేషన్లను కూడా మంజూరు చేయడం జరిగిందని చెప్పారు.
{{/usCountry}}రూ.7 కోట్ల వ్యయంతో ఏటూరునాగారంలో RTC బస్ డిపోను మంజూరు చేయడం జరిగిందని మంత్రి సీతక్క తెలిపారు. ఏటూరునాగారంలో డిపో ఏర్పాటు చేస్తే అటవీ ప్రాంతాలు, భద్రాచలం, మంగపేట, వాజేడు, వెంకటాపురం వంటి ప్రాంతాలన్నీ సమగ్రంగా కవర్ అవుతాయని స్పష్టం చేశారు. అందుకే ఏటూరునాగారమే అనుకూల ప్రాంతమని సూచించగా… ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అలాగే మంగపేట, ములుగు తదితర మండలాల్లో మినీ బస్స్టేషన్లను కూడా మంజూరు చేయడం జరిగిందని చెప్పారు.
{{/usCountry}}