ప్రయాణికులకు శుభవార్త - మేడారం జాతరకు 28 ప్రత్యేక రైళ్లు, రూట్ల వారీగా వివరాలు
మేడారం మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. మొత్తం 28 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి.
మేడారం జాతరకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. దీంతో ములుగు వైపు వెళ్లే రూట్లన్నీ రద్దీగా మారుతున్నాయి. ఈనెల 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో… దక్షిణ మధ్య రైల్వే 28 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు నడుస్తాయి. ఈ ట్రైన్స్… సికింద్రాబాద్, మంచిర్యాల్, సిరిపూర్ కాగజ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం ప్రాంతాల నుంచి అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.
ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు నడిచే మేడారం జాతర ప్రత్యేక రైళ్లు పూర్తిగా అన్ రిజర్వుడ్ జనసాధారణ రైళ్లని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించింది. ఈ రైళ్లలో సెకండ్ జనరల్ క్లాస్ కోచులుంటాయని పేర్కొంది.
- ఈనెల 28, 30, ఫిబ్రవరి 1 తేదీల్లో సికింద్రాబాద్ -మంచిర్యాల- సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్-మంచిర్యాల రైలు(ట్రైన్ నెంబర్ 07495) ఉదయం 5.45 గంటలకు సికిందరాబాద్‌లో బయలుదేరి ఉదయం 8.45 గంటలకు కాజీపేటకు, మధ్యాహ్నం 1.30 గంటలకు మంచిర్యాలకు చేరుకుంటుంది. తిరిగి ఇదే రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు మంచిర్యాల-సికింద్రాబాద్ రైలు ( ట్రైన్ నెంబర్ 07496) మంచిర్యాల నుంచి బయలుదేరి రాత్రి 8 గంటలకు కాజిపేటకు…. రాత్రి 10.10 గంటలకు సికిందరాబాద్ చేరుకుంటుంది.
- చర్లపల్లి, ఘట్ కీసర్, బీబీ నగర్, భువనగిరి, ఆలేరు, పెంబర్తి, రఘునాథ్ పల్లి, కాజీపేట, వరంగల్, ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి, రాఘువపురం, రామగుండం, పెద్దంపేట్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
- ఇక జనవరి 29, 31 తేదీల్లో సికింద్రారాబాద్-సిరిపుర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్ (07497/07498) మధ్య మేడారం ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. సికింద్రాబాద్ నుంచి ఉదయం ఉదయం 5.45 గంటలకు బయలుదేరి… మధ్యాహ్నం 2 గంటలకు సిరిపూర్ కాగజ్‌నగర్ చేరుకుంటాయి. అదే రోజు మద్యాహ్నం 2.30 గంటలకు సిరిపూర్ కాగజ్‌నగర్‌లో బయలుదేరి… రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటాయి. ఈ రైళ్లు… మౌలాలి, ఘట్ కీసర్, బీబీ నగర్, కాజీపేటతో పాటు మరికొన్ని స్టేషన్లలో ఆగుతాయి.
- మరోవైపు నిజామాబాద్- వరంగల్ మధ్య ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ నెల 28 నుంచి 31 వరకు రాకపోకలు సాగిస్తాయి. ఈ రైళ్లు నిజామాబాద్‌లో ఉదయం 7.05 గంటలకు బయలుదేరి… మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ చేరుకుంటాయి. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు వరంగల్‌లో బయలుదేరి అదే రాత్రి 10.30 గంటలకు నిజామాబాద్ చేరుకుంటాయి.
- అంతేకాకుండా ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఖమ్మం-కాజీపేట మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఖమ్మంలో ఉదయం 10 గంటలకు ఖమ్మంలో బయలుదేరే ట్రైన్… మధ్యాహ్నం 12.50 గంటలకు కాజీపేట చేరుకుంటాయి. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కాజీపేటలో బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు ఖమ్మం చేరుకుంటాయి. ఇక ఆదిలాబాద్-కాజీపేట (ట్రైన్ నెంబర్ 07501) మధ్య ప్రత్యేక రైలు ఉంటుంది. జనవరి 28, 29 తేదీల్లో అందుబాటులో ఉంటాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

