TGRJC CET 2026 : నేటితో ముగియనున్న టీజీఆర్‌జేసీ సెట్‌ దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

TGRJC CET 2026 Updates : టీజీఆర్ జేసీ సెట్ - 2026కు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ప్రవేశాలు కల్పిస్తారు.

Published on: Apr 15, 2026 11:39 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TGRJC CET Applications 2026 : తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్(TGRJC CET) జారీ అయిన సంగతి తెలిసిందే. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా… ఈ గడువు నేటితో (ఏప్రిల్ 15) ముగియనుంది. కాబట్టి అర్హులైన విద్యార్థులు… వెంటనే అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

టీజీఆర్‌జేసీ సెట్‌ దరఖాస్తుకు నేడే తుది గడువు
టీజీఆర్‌జేసీ సెట్‌ దరఖాస్తుకు నేడే తుది గడువు

మే 3వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్…

టీజీఆర్ జేసీ సెట్ అప్లికేషన్ ఫీజు కింద రూ. 200 చెల్లించాలి. ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపులలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థుల కోసం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. సీటు పొందే విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం ఉంటుంది.మార్చి 2026లో పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 3వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.

ప్రవేశ పరీక్షలో సాధించిన ప్రతిభ (మెరిట్)తో పాటు రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. అర్హత గల విద్యార్థులు వెబ్‌సైట్ http://tgrjc.cgg.gov.in/. ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాల కోసం వెబ్‌సైట్‌లోని ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను చూడొచ్చు. 040-24734899 ఫోన్ నంబర్‌ను సంప్రదించి… వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ ఏడాది గురుకులాల్లో ప్రవేశం కోసం విద్యార్థుల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. అందుబాటులో ఉన్న మొత్తం 6,700 సీట్ల కోసం ఇప్పటివరకు సుమారు 60 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే సగటున ప్రతి ఒక్క సీటుకు 9 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు.

  • జనరల్ గురుకుల కళాశాలలు: 35 కాలేజీల్లో మొత్తం 3,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (KGBV): 93 విద్యాలయాల్లో మొత్తం 3,700 సీట్లు ఉన్నాయి.

ఈ ఏడాది ఈ ప్రవేశ ప్రక్రియలో విద్యాశాఖ ఒక కీలక మార్పును చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా (COE) రూపుదిద్దుకున్న 93 కేజీబీవీల్లో ప్రవేశాల కోసం ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. గతంలో ఇక్కడ ప్రవేశాల తీరు వేరుగా ఉండేది. కానీ విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఇప్పుడు పోటీ పరీక్ష ద్వారానే విద్యార్థులను ఎంపిక చేస్తారు.

ప్రధానంగా ఎంపీసీ (MPC), బైపీసీ , ఎంఈసీ/సీఈసీ గ్రూపుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. పదో తరగతి స్థాయిలో చదివిన అంశాల ఆధారంగానే ప్రశ్నపత్రం ఉంటుంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఎంపికైన వారికి కార్పొరేట్ స్థాయిలో ఉచిత వసతితో కూడిన నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More