...
...
Next Story

TGRJC CET 2026 : ఇంటర్ అడ్మిషన్లు - టీజీఆర్‌జేసీ సెట్‌ దరఖాస్తులు ప్రారంభం, ముఖ్య వివరాలు

TGRJC CET 2026 Updates : టీజీఆర్ జేసీ సెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.ఏప్రిల్ 15వ తేదీతో దరఖాస్తుల గడువు ముగుస్తుంది. మే 3వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.

Published on: Mar 16, 2026 02:09 PM IST
Advertisement

వెతెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్(TGRJC CET) జారీ అయిన సంగతి తెలిసిందే. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం….

టీజీఆర్ జేసీ సెట్ 2026
టీజీఆర్ జేసీ సెట్ 2026

టీజీఆర్ జేసీ సెట్ ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు ఫీజు కింద రూ. 200 చెల్లించాలి. ఏప్రిల్ 15వ తేదీతో దరఖాస్తుల గడువు ముగుస్తుంది. మే 3వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.

ఇంగ్లీషు మీడియంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపులలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థుల కోసం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. సీటు పొందే విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం ఉంటుంది.మార్చి 2026లో పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రవేశ పరీక్షలో సాధించిన ప్రతిభ (మెరిట్)తో పాటు రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. ఇతర వివరాల కోసం వెబ్‌సైట్‌లోని ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను చూడొచ్చు. 040-24734899 ఫోన్ నంబర్‌ను సంప్రదించి… వివరాలను తెలుసుకోవచ్చు.

అప్లికేషన్ విధానం:

  1. అభ్యర్థులు http://tgrjc.cgg.gov.in/. వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. ముందుగా నిర్ణయించిన అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
  3. ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్ పై క్లిక్ చేయాలి.
  4. విద్యార్థి వివరాలను నమోదు చేయటంతో పాటు ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాలి.
  5. చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
  6. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ కాపీని పొందొచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe