...
...
Next Story

దసరాకు టీజీఎస్‌ఆర్‌టీసీ స్పెషల్ బస్సులు.. కాలనీలు, హాస్టళ్ల వద్దకే.. కాంటాక్ట్ నెంబర్స్

TGSRTC Dasara Special Buses : దసరాకు టీజీఎస్‌ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. 30 మందికిపైగా ఉంటే.. కాలనీలు, హాస్టళ్ల వద్దకే బస్సులు వచ్చి పికప్ చేసుకుంటాయి.

Published on: Oct 7, 2026, 10:36:44 IST
Advertisement

దసరా పండుగ వేళ గ్రేటర్ హైదరాబాద్ నుంచి తమ సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) భారీ ఏర్పాట్లు చేస్తోంది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు సంస్థ దాదాపు 7,000 పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్ వెల్లడించారు.

టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ఈసారి ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్‌ఆర్‌టీసీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, టౌన్‌షిప్‌లు లేదా విద్యార్థుల హాస్టళ్ల ప్రాంతాల్లో కనీసం 30 మంది ప్రయాణికులు సిద్ధంగా ఉంటే.. వారి ప్రాంతానికే నేరుగా ఆర్టీసీ ప్రత్యేక బస్సును పంపిస్తారు.

కూకట్‌పల్లి, జేఎన్టీయూ, మాదాపూర్, సుచిత్ర సర్కిల్, ఎల్బీనగర్, హయత్‌నగర్, బడంగ్ పేట్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, రాజేంద్రనగర్, మెహదీపట్నం, అత్తాపూర్, కోటి, వనస్థలిపురం వంటి కీలక ప్రాంతాల నివాసితులు, విద్యార్థులు ఈ ముందస్తు బుకింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం జిల్లాల వారీగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన రూట్లు చూసుకుంటే.. కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, జగిత్యాల, కొత్తగూడెం, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, పెద్దపల్లి, సూర్యాపేట, కోదాడ, భద్రాచలం, ఖమ్మం, ఆర్మూర్ పట్టణాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు.

ఈ సర్వీసులు కావాలనుకునే విద్యార్థులు మరియు ప్రయాణికులు తమ సమీపంలోని ఆర్టీసీ డిపోలను లేదా సంబంధిత డివిజనల్ డిప్యూటీ రీజనల్ మేనేజర్లను సంప్రదించవచ్చు. బస్సుల వివరాలు, ముందస్తు బుకింగ్స్ సమాచారం కోసం జూబ్లీ బస్ స్టేషన్ జోనల్ కమ్యూనికేషన్ సెల్ ఫోన్ నంబర్.. 9959226160ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

ప్రాంతాల వారీగా సంప్రదించాల్సిన నంబర్లు

సికింద్రాబాద్, మల్కాజిగిరి, ఏఎస్ రావు నగర్, రేతిఫైల్, తార్నాక, ఉప్పల్: సికింద్రాబాద్ DRM – 99592 26142

దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్, ఎల్‌బీ నగర్, బడంగ్‌పేట్, ఆదిబట్ల, మిదాని, సరూర్‌నగర్: హయత్‌నగర్ డివిజన్ DRM – 99892 26136

మెహదీపట్నం, రాజేంద్రనగర్, అత్తాపూర్, చార్మినార్, కోటి, కాచిగూడ, నారాయణగూడ: చార్మినార్ డివిజన్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ – 99592 26129

ఐటీ కారిడార్‌లలో పనిచేసే ఉద్యోగులకు ప్రయాణ సమయం ఆదా అయ్యేలా టీజీఎస్‌ఆర్‌టీసీ ప్రత్యేక మార్గాలను ఖరారు చేసింది. విజయవాడ, బెంగళూరు తదితర సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను సిటీ ట్రాఫిక్‌లోకి రాకుండా నేరుగా గచ్చిబౌలి ఔటర్ రింగు రోడ్డు మీదుగా మళ్లించనున్నారు. దీనివల్ల ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పి, వేగంగా గమ్యస్థానాలకు చేరుకునే వీలు కలుగుతుంది. దసరా సెలవుల్లో ప్రయాణించే పౌరులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి అధిక ఛార్జీలు చెల్లించకుండా, సురక్షితమైన, నమ్మకమైన ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని సంస్థ ప్రతినిధులు కోరారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks