...
...
Next Story

TGSRTC Rakhi Special Buses : రాఖీ పౌర్ణమి స్పెషల్... 5 వేల ప్రత్యేక బస్సులు

TGSRTC Rakhi Special Buses : రాఖీ పౌర్ణమి వేళ ప్రయాణికుల కోసం టీజీఎస్‌ఆర్టీసీ 5,000 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని… అదనపు బస్సులు నడుపుతామని అధికారులు ప్రకటించారు.

Published on: Aug 27, 2026, 22:13:50 IST
Advertisement

TGSRTC Rakhi Special Buses : రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) తియ్యటి కబురు అందించింది. పండుగ వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా రవాణా సౌకర్యాలను సులభతరం చేసేందుకు సంస్థ యాజమాన్యం విస్తృత స్థాయి ఏర్పాట్లు పూర్తి చేసింది.

గత ఏడాది కంటే అదనంగా 240 బస్సులు!

రాఖీ పౌర్ణమి సందర్భంగా TGSRTC ప్రత్యేక బస్సులు
రాఖీ పౌర్ణమి సందర్భంగా TGSRTC ప్రత్యేక బస్సులు

పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని 2026 ఆగస్టు 27 నుంచి ఆగస్టు 31 వరకు మొత్తం 5,000 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. గత ఏడాది రాఖీ పౌర్ణమి సందర్భంగా సంస్థ 4,760 ప్రత్యేక బస్సులను మాత్రమే నడిపింది. అయితే ఈ ఏడాది ప్రయాణికుల తాకిడి గణనీయంగా పెరిగే అవకాశం ఉండటంతో, గతంతో పోలిస్తే అదనంగా మరో 240 బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన మార్గాల్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా తక్షణమే మరిన్ని అదనపు బస్సులను డిపోల నుంచి రోడ్డుపైకి తీసుకురావాలని డిపో మేనేజర్లను, రీజినల్ మేనేజర్లను ఆదేశించారు.

తిరుగు ప్రయాణాలపై ప్రత్యేక దృష్టి….

పండుగ రోజు ముగిసిన తర్వాత తిరిగి నగరాలకు, పనిప్రాంతాలకు చేరుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆగస్టు 30 ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆగస్టు 31 సోమవారం రోజంతా తిరుగు ప్రయాణాల రద్దీ అత్యంత భారీగా ఉండే అవకాశం ఉందని ఆర్టీసీ అంచనా వేసింది. ఈ సమయాన్ని పురస్కరించుకుని ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'మహాలక్ష్మి' పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం రాఖీ పండుగ రోజుల్లోనూ యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, వారికి తగినన్ని బస్సులను అందుబాటులో ఉంటాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe