...
...
Next Story

TGSRTC Recruitment Results : ఆర్టీసీ ఉద్యోగ నియామక ఫలితాలు విడుదల - సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలివే

TGSRTC Recruitment Results : టీజీఎస్‌ఆర్‌టీసీలో టీఎస్‌టీ, ఎంఎస్‌టీ పోస్టుల రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అర్హత సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్ 16, 17 తేదీల్లో అంబర్‌పేటలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ ఫలితాలను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వెబ్ సైట్ లో చూడొచ్చు.

Published on: Apr 11, 2026 02:01 PM IST
Advertisement

TGSRTC Recruitment Results : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (TST), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (MST) పోస్టుల రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మార్చి 29న నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (TGPRB) అధికారికంగా విడుదల చేసింది.

టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగ నియామక ఫలితాలు
టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగ నియామక ఫలితాలు

టీఎస్‌టీ విభాగంలో పరీక్షకు హాజరైన 15,796 మంది అభ్యర్థుల్లో 9,377 మంది (59.36 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఎంఎస్‌టీ విభాగంలో 4,817 మంది పరీక్ష రాయగా, వారిలో 2,755 మంది (57.19%) క్వాలిఫై అయ్యారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు :

రాత పరీక్షలో కనబరిచిన మెరిట్ ఆధారంగా.... ఒక్కో పోస్టుకు ఐదుగురు అభ్యర్థుల చొప్పున (1:5 నిష్పత్తిలో) సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపిక చేశారు. వీరికి ఈనెల 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నారు.

ఎంపికైన అభ్యర్థుల ఇంటిమేషన్ లెటర్లు ఈనెల 12వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అందుబాటులోకి వస్తాయి. ఏప్రిల్ 15వ తేదీ అర్ధరాత్రి వరకు www.tgprb.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట అవసరమైన అన్ని ఒరిజినల్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే కార్యాలయ పనివేళల్లో 9391005006 నంబరును సంప్రదించవచ్చు లేదా support@tslprb.in కు ఈమెయిల్ పంపవచ్చు.

ఫలితాలను ఎక్కడ చెక్ చేసుకోవాలంటే..?

  • ముందుగా https://www.tgprb.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోని Supervisor Trainees Recruitment 2025 in TGSRTC సెక్షన్ లోకి వెళ్లాలి.
  • ఇక్కడ డౌన్లోడ్ రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • అభ్యర్థి మొబైల్ నెంబర్ తో పాటు పాస్ వర్డ్ వివరాలను నమోదు చేసి లాగిన్ కావాలి.
  • మీ రిజల్ట్ కాపీ ఇక్కడ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కాపీని పొందొచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe