On Site FIR : ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్.. బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేదు!
On Site FIR : ఆన్-సైట్ ఎఫ్ఐఆర్ సిస్టమ్‌ను వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ప్రారంభించారు. బాధితులకు సౌకర్యవంతంగా ఉండే ప్రాంతంలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు.
పోలీసు సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా, తీవ్రమైన నేరాలను ఎదుర్కోవడానికి 'ఆన్-సైట్ ఎఫ్ఐఆర్' (ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్) విధానాన్ని అమలు చేస్తున్నట్లు వనపర్తి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సునీత రెడ్డి ప్రకటించారు.

ఎస్పీ ప్రకారం.. ఈ ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ వల్ల పోలీసు అధికారులు సంఘటనా స్థలంలోనే లేదా బాధితులకు సౌకర్యవంతంగా ఉండే వారి నివాసం, ఆసుపత్రి లేదా ఏదైనా సురక్షితమైన ప్రదేశంలో ఫస్ట్ ఇన్ఫర్మేషన్(FIR) నమోదు చేయవచ్చు. దీనివల్ల, ముఖ్యంగా ఆందోళనకర పరిస్థితులలో బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
హత్య, అత్యాచారం, దోపిడీ, దొంగతనం, కిడ్నాప్, మహిళలు, పిల్లలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలు, ఎస్సీ/ఎస్టీ సంబంధిత కేసులు, బాల్య వివాహాలు, ర్యాగింగ్ వంటి తీవ్రమైన నేరాలకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. సంఘటనా స్థలంలోనే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం వల్ల సాక్ష్యాలను వేగంగా సేకరించవచ్చని, నిందితులను వెంటనే పట్టుకునే అవకాశాలు మెరుగుపడతాయని ఎస్పీ సునీత రెడ్డి చెప్పారు.
కరీంనగ్ సీపీ సమీక్ష
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ మీద ఎస్పీలు సమీక్షలు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు విధానం అమలు, అవగాహన, సమర్థవంతమైన నిర్వహణపై కరీంనగర్ సీపీ గౌష్ ఆలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కమిషనరేట్‌లోని అన్ని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో మాట్లాడారు.
'బాధితులకు సులభంగా న్యాయం అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్-సైట్ ఎఫ్‌ఐఆర్ విధానం అత్యంత ముఖ్యమైంది. మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇతర బాధితులు పోలీస్ స్టేషన్‌కు రాకుండా వారి నివాసం లేదా సంఘటన స్థలంలోనే ఫిర్యాదు స్వీకరించాలి. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ద్వారా వేగవంతమైన న్యాయం సాధ్యమవుతుంది.' అని సీపీ గౌష్ అన్నారు. ఎఫ్ఐర్ కాపీని బాధితులకు అందించాలని కరీంనగర్ సీపీ అన్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో వీడియో రికార్డింగ్ తప్పనిసరి అన్నారు.
ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ అందజేత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ పోలీసులు ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రదేశానికే పోలీసులు వెళ్లి ఎఫ్ఐఆర్ కాపీని బాధితుడికి అందజేశారు. ఓ కేసు విషయంలో గూగులోత్ రాములు అనే మేకల కాపరి ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటన స్థలంలోనే ఫిర్యాదు స్వీకరించి.. కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని బాధితుడికి అందజేశారు.
ప్రజలకు త్వరితగితన, పారదర్శకంగా, సౌకర్యవంతమైన పోలీస్ సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు, వృద్ధులు, పోలీస్ స్టేషన్ స్వయంగా రావడానికి ఇబ్బంది పడే బాధితులకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper












