Mardaani 3 Ott: అఫీషియల్.. మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. చిన్నపిల్లల కిడ్నాప్

Mardani 3 Ott: థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఓ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరికొన్ని గంటల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో చిన్న పిల్లల కిడ్నాప్ కేసు చుట్టూ కథ సాగుతుంది.

Published on: Mar 26, 2026, 10:40:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

థియేటర్లలో అదరగొట్టిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘మర్దానీ 3’ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ ఫ్రాంఛైజీలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచిన మర్దానీ 3 ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. మరికొన్ని గంటల్లోనే ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో రాణీ ముఖర్జీ లీడ్ రోల్ ప్లే చేసింది. ఈ సినిమా చిన్నపిల్లల కిడ్నాప్ చుట్టూ సాగుతుంది.

ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ (x/yrf)
ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ (x/yrf)

మర్దానీ 3 ఓటీటీ

బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ లీడ్ రోల్ ప్లే చేసిన ఫీమేల్ లీడ్ మూవీ ‘మర్దానీ 3’. ఇది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. మార్చి 27 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పుడైతే కేవలం హిందీలోనే సినిమా డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులోకి రానుంది.

అఫీషియల్

బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన ‘మర్దానీ 3’ ఓటీటీ స్ట్రీమింగ్ పై అఫీషియల్ సమాచారం వచ్చింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అప్ డేట్ ఇచ్చారు. మర్దానీ 3 సినిమా జనవరి 30, 2026న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఎనిమిది వారాలకు డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తోంది.

సూపర్ హిట్

మర్దానీ 3 సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ మర్దానీ 3 మూవీకి అభిరాజ్ మినావాలా డైరెక్టర్. ఇందులో రాణీ ముఖర్జీతో పాటు జానకీ బొడివాలా, మల్లిక ప్రసాద్, జిషు సేన్ గుప్తా తదితరులు నటించారు.

మర్దానీ 3 స్టోరీ

మర్దానీ ఫ్రాంఛైజీలో తన యాక్షన్ తో రాణీ ముఖర్జీ అదరగొట్టింది. ఇప్పుడు మర్దానీ 3లోనూ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా యాక్టింగ్ ఇరగదీసింది. ఈ సినిమాలో ఆమె శివానీ శివాజీ రాయ్ ఐపీఎస్ గా తనదైన స్టైల్లో యాక్షన్ తో సత్తాచాటింది.

మర్దానీ 3 సినిమాలో చిన్నపిల్లల కిడ్నాప్ ల చుట్టూ కథ సాగుతుంది. 8 నుంచి పదేళ్ల వయసున్న పిల్లలు కిడ్నాప్ అవుతుంటారు. ఏకంగా 93 మంది కనిపించకుండా పోతారు. ఈ కేసును శివానీ టేకప్ చేస్తుంది. ఈ కిడ్నాప్ ల వెనుక బిచ్చగాళ్ల మాఫియా, మెడికల్ ప్రయోగాలు ఉంటాయి. మరి ఈ కేసును శివానీ ఎలా సాల్వ్ చేసిందనేది మర్దానీ 3 సినిమాలో చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More