ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ(టీఎస్‌టీ), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ(ఎంఎస్‌టీ) రాతపరీక్షల ప్రాథమిక కీలు విడుదలయ్యాయి. ఈ మేరకు పోలీస్ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఓ ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణ ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 198 ఖాళీలున్నాయి. ఇందుకోసం మార్చి 29వ తేదీన ఎగ్జామ్ నిర్వహించగా… శనివారం (ఏప్రిల్ 05) ప్రాథమిక కీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ప్రాథమిక కీపై ఏవైనా సందేహాలుంటే అభ్యర్థులు అభ్యంతరాలు తెలుపొచ్చు. ప్రతి ప్రశ్నకు విడివిడిగా సరైన ఆధారపత్రాలతో సహా వెబ్‌సైట్‌లోని నిర్ణీత టెంప్లెట్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. అభ్యంతరాలను తప్పనిసరిగా అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ ఏరియాలో ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పంపాల్సి ఉంటుంది.
TST, MST ప్రాథమిక కీ డౌన్లోడ్ ఇలా…
- అభ్యర్థులు https://www.tgprb.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- సూపర్ వైజర్ ట్రైనీయిస్ రిక్రూట్ మెంట్ 2025 ఆప్షన్ లోనిTST, MST ప్రాథమిక కీ ఆప్షన్లు ఉంటాయి.
- మీరు హాజరైన పరీక్షకు సంబంధించిన కీపై క్లిక్ చేస్తే పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ప్రాథమిక కీ కాపీని పొందొచ్చు.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ (84), మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ - 114 పోస్టులను భర్తీ చేస్తారు.అన్ని కలిపి 198 పోస్టులున్నాయి. అభ్యంతరాలు లెవనెత్తే అభ్యర్థులు…. ప్రతి ప్రశ్నకు రూ.500 రుసుంను చెల్లించాల్సి ఉంటుందని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు పేర్కొంది. ఒకవేళ అభ్యర్థి లేవనెత్తిన అభ్యంతరం సరైనదిగా నిర్ధారణైతే రుసుంను తిరిగిచ్చేస్తామని స్పష్టం చేశారు.