కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందిస్తున్న విషయం తెలిసిందే. లక్షల మంది మహిళలకు ఈ పథకం వరంగా మారింది. ప్రస్తుతం మహిళలు బస్సులో వెళ్తుంటే కండక్టర్‌కు ఆధార్ కార్డు చూపించి.. జీరో టికెట్ తీసుకుంటున్నారు. అయితే ఈ విధానానికి ఆర్టీసీ గుడ్‌బై చెప్పనుంది. ఇకపై స్మార్ట్ కార్డులను చూపిస్తే సరిపోతుంది.

మహిళలకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఇందులో కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. అతి త్వరలో మహిళలకు ఈ స్మార్ట్ కార్డులను రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. దీంతో ప్రయాణం ఈజీ కానుంది.
ఆధార్ కార్డు కారణంగా చాలాసార్లు కండక్టర్, మహిళల మద్య వాగ్వాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. కొందరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోవడంతో ఆంధ్రప్రదేశ్ అని చూపిస్తుంది. ఆధార్ కార్డు మీది కాదు అని, పొటో సరిగా కనిపించక.. ఇలా అనేక సమస్యలు కొన్నిసార్లు ఎదురవుతున్నాయి. స్మార్ట్ కార్డుతో వీటన్నింటికీ చెక్ పడనుంది.
ప్రజాభవన్‌లో ఆర్టీసీ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అర్హులైన మహిళలకు త్వరగా స్మార్ట్ కార్డులు చేరేలే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. త్వరలో పీఎం ఈ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌కు 2800 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని మంత్రులు వెల్లడించారు. వరంగల్‌కు 100 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 252 కోట్ల ప్రయాణాలు జరిగాయన్నారు.
నిజానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు ప్రయాణానికి స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టడం ద్వారా తన టిక్కెట్లు, పాస్ వ్యవస్థను ఆధునీకరించడానికి సిద్ధమవుతోంది. విద్యార్థులకు కూడా బస్ పాస్‌ల బదులుగా స్మార్ట్ కార్డులను తీసుకు వచ్చే ఆలోచనలో ఉంది. ఈ విధానం దశలవారీగా అమలు చేయడానికి ప్రణాళికలు వేస్తోంది.
{{/usCountry}}నిజానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు ప్రయాణానికి స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టడం ద్వారా తన టిక్కెట్లు, పాస్ వ్యవస్థను ఆధునీకరించడానికి సిద్ధమవుతోంది. విద్యార్థులకు కూడా బస్ పాస్‌ల బదులుగా స్మార్ట్ కార్డులను తీసుకు వచ్చే ఆలోచనలో ఉంది. ఈ విధానం దశలవారీగా అమలు చేయడానికి ప్రణాళికలు వేస్తోంది.
{{/usCountry}}TGSRTC బస్ పాస్‌లను పొందడం, పునరుద్ధరించే ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా చేయాలని భావిస్తోంది. ఇది డిజిటల్ టెక్నాలజీకి అనుగుణంగా మారడానికి వీలు కల్పిస్తుంది. ఇతర రాష్ట్రాల నమూనాలపై అధ్యయనం కూడా జరిగింది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఈ స్మార్డ్ కార్డు విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ విధానం తెలంగాణలోని ప్రయాణికులకు ఉత్తమ అనుభవాన్ని అందించనుంది. రాబోయే నెలల్లో ఈ పథకాన్ని దశలవారీగా అమలు చేయాలని భావిస్తున్నారు. 2026లో స్మార్ట్ కార్డులు పంపిణీ మెుదలు కావొచ్చు.