సింగిల్​ ఛార్జ్​తో 679 కి.మీ వరకు రేంజ్​- 2025లో అదరగొట్టిన ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలు..

2025లో ఇండియాలో ఎలక్ట్రిక్​ వాహనాల హవా కొనసాగింది! మరీ ముఖ్యంగా ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ సెగ్మెంట్​లో అదిరిపోయే మోడల్స్​ లాంచ్​ అయ్యాయి. హ్యుందాయ్​ క్రెటా ఎలక్ట్రిక్​ నుంచి విన్​ఫాస్ట్​ వీఎఫ్​6, వీఎఫ్​7 వరకు పలు ఎగ్జైటింగ్​ మోడల్స్​ రావడంతో కస్టమర్లకు ఆప్షన్స్​ పెరిగాయి..

Published on: Dec 20, 2025, 06:00:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2025లో భారత ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్ అనూహ్యమైన వేగంతో పుంజుకుంది! అనేక కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు మార్కెట్లోకి రావడంతో కొనుగోలుదారులకు మునుపెన్నడూ లేనంతగా ఆప్షన్స్​ లభించాయి. చిన్నపాటి సిటీ క్రాస్ఓవర్ల నుంచి పెద్ద ఫ్యామిలీ ఎస్‌యూవీల వరకు ఈ ఏడాది మార్కెట్‌ను ఒక ఊపు ఊపిన 7 కీలక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల వివరాలను ఇక్కడ చూసేయండి..

మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​..
మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​..

2025లో అదరగొట్టిన ఎలక్ట్రిక్​ కార్లు ఇవి..

1. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్-

భారతదేశంలో అత్యధిక ఆదరణ పొందిన క్రెటా మోడల్, 2025లో ఎలక్ట్రిక్ రూపంలో అడుగుపెట్టింది. ఇది 42 కేడబ్ల్యూహెచ్​, 51.4 కేడబ్ల్యూహెచ్​ అనే రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 133 బీహెచ్​పీ నుంచి 169 బీహెచ్​పీ వరకు పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ ఫోన్ సుమారు 420 కి.మీ నుంచి 510 కి.మీ వరకు రేంజ్​ని ఇస్తుంది ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ.

2. టాటా హారియర్ ఈవీ-

టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ హారియర్‌ను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో లాంచ్ చేసింది. కొత్త acti.ev Plus ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన ఈ కారులో 65 కేడబ్ల్యూహెచ్​, 75 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఇది గరిష్టంగా 627 కి.మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) ఆప్షన్, లెవల్-2 అడాస్​ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

3. మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​-

మహీంద్రా నుంచి వచ్చిన ఈ 7-సీటర్ ఎక్స్​ఈవీ 9ఎస్​ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కుటుంబ అవసరాలకు సరిగ్గా సరిపోతుంది. ఇందులో 59 కేడబ్ల్యూహెచ్​, 70 కేడబ్ల్యూహెచ్​, 79 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఇది 521 కి.మీ నుంచి 679 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్, ట్రిపుల్ డిజిటల్ స్క్రీన్స్ దీని ప్రత్యేకతలు.

4. కియా కారెన్స్ క్లావిస్ ఈవీ-

ఇది టెక్నికల్‌గా ఎంపీవీ అయినప్పటికీ, ఎస్‌యూవీ తరహా లుక్, 7-సీటర్ సౌకర్యంతో వస్తోంది. 42 కేడబ్ల్యూహెచ్​, 51.4 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీలతో వస్తున్న ఈ కారు 404 కి.మీ నుంచి 490 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్, పానోరమిక్ సన్‌రూఫ్ వంటి కంఫర్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

5. విన్‌ఫాస్ట్ వీఎఫ్​7-

వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ కంపెనీ వీఎప్​7 మోడల్‌తో భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది 70.8–75.3 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 438 కి.మీ నుంచి 532 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. సింగిల్, డ్యూయల్ మోటార్ వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది.

6. విన్‌ఫాస్ట్ వీఎఫ్​6-

ఇది విన్‌ఫాస్ట్ నుంచి వచ్చిన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ముఖ్యంగా సిటీలో డ్రైవ్ చేసేవారికి, బడ్జెట్ చూసుకునే వారికి ఇది మంచి ఆప్షన్​ అవుతుంది! ఇందులో 59.6 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంటుంది. ఇది సుమారు 468 కి.మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. చిన్న కారు అయినప్పటికీ, గ్రౌండ్ క్లియరెన్స్- స్పేస్ విషయంలో రాజీ పడలేదు!

7. వోల్వో ఈఎక్స్​30

లగ్జరీ సెగ్మెంట్‌లో వోల్వో ఈఎక్స్​30 ఒక పవర్‌ఫుల్ ఎంట్రీ. ఇది 69 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీతో 272 బీహెచ్​పీ పవర్‌ను విడుదల చేస్తుంది. కేవలం 5.3 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట రేంజ్ 480 కి.మీ. కేవలం 28 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ అయ్యే ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం దీని సొంతం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More