ఇండియాలోకి మరో ఫ్యామిలీ ఎంపీవీ- నిస్సాన్​ నుంచి కొత్త కారు, ఇంకొన్ని రోజుల్లో..

నిస్సాన్ నుంచి ఇండియాలోకి కొత్త ఎంపీవీ వచ్చేస్తోంది. డిసెంబర్ 18న కొత్త మోడల్​ని సంస్థ ఆవిష్కరించనుంది. ఈ మోడల్​ రెనాల్ట్​ ట్రైబర్​కి రీబ్రాండెడ్​ వర్షెన్​ అని తెలుస్తోంది. ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Dec 12, 2025 4:01 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిస్సాన్ సంస్థ భారతదేశంలో తమ కొత్త ఫ్యామిలీ, కాంపాక్ట్ బీ-సెగ్మెంట్ ఎంపీవీని డిసెంబర్ 18న ఆవిష్కరించనుంది. 2027 నాటికి దేశంలో మూడు కొత్త మోడళ్లను విడుదల చేయాలనే ప్రణాళికలో ఇది మొదటి అడుగు అని అధికారిక ప్రకటన ద్వారా సంస్థ వెల్లడించింది.

Nissan B-MPV
Nissan B-MPV

భారత్‌కు నిస్సాన్ మూడు కొత్త మోడళ్లు..

ఈ కొత్త ఎంపీవీ నిస్సాన్ రిఫ్రెష్డ్​ ప్రాడక్ట్​ స్ట్రాటజీ కింద మొదటగా లాంచ్ కానుంది. ఇది ఫిబ్రవరి 2026 నాటికి మార్కెట్‌లోకి వస్తుంది.

మొదటి మోడల్: బీ-ఎంపీవీ (ఫిబ్రవరి 2026): కొత్త కాంపాక్ట్ ఎంపీవీ.

రెండో మోడల్: టెక్టాన్ ఎస్‌యూవీ (జూన్ 2026): ఇప్పటికే వర్చువల్ షోకేస్ ద్వారా ప్రదర్శించిన ఈ మోడల్‌ను జూన్ 2026లో విడుదల చేస్తారు.

మూడో మోడల్: 7-సీటర్ ఎస్‌యూవీ (2027 ప్రారంభంలో): టెక్టాన్ ఎస్‌యూవీ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించిన మూడు-వరుసల ఎస్‌యూవీ.. 2027 ప్రారంభంలో వచ్చే అవకాశం ఉంది.

రెనాల్ట్ ట్రైబర్ ఆధారంగా కొత్త నిస్సాన్ ఎంపీవీ..

ఈ కొత్త బీ-ఎంపీవీ ఇప్పటికే భారత రోడ్లపై పలుమార్లు టెస్ట్ర్​ డ్రైవ్​ చేస్తూ కనిపించింది. అందుబాటులో ఉన్న స్పై షాట్‌లు, నిస్సాన్ టీజర్‌ల ఆధారంగా చూస్తే, ఇది రెనాల్ట్ ట్రైబర్ మోడల్‌కు రీ-బ్యాడ్జ్ చేసిన వెర్షన్‌గా ఉండే అవకాశం ఉంది.

రెండు వాహనాలు ఒకే అంతర్లీన ప్లాట్‌ఫారమ్‌ను, మెకానికల్ భాగాలను పంచుకుంటాయి.

అయితే, నిస్సాన్ వెర్షన్‌లో దాని సొంత ఎక్స్​టీరియర్​, ఇంటీరియర్​ డిజన్​- ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు.

పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ, ఈ కొత్త ఎంపీవీ కూడా ట్రైబర్‌లో ఇటీవల ప్రవేశపెట్టిన కొన్ని అప్‌డేట్‌లను ప్రతిబింబిస్తుంది. నిస్సాన్ దాని ప్రస్తుత స్టైలింగ్‌కు అనుగుణంగా కొత్త హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, బంపర్‌లు, అల్లాయ్ వీల్స్‌తో ముందు- వెనుక భాగాల్లో కొత్త డిజైన్‌ను జోడించి ట్రైబర్ నుంచి వేరుగా ఉండేలా రూపొందించనుంది. ఇంటీరియర్ క్యాబిన్‌లో కూడా నిస్సాన్‌కు ప్రత్యేకమైన ట్రిమ్, పరికరాల మార్పులు ఉండే అవకాశం ఉంది.

నిస్సాన్​ కొత్త ఎంపీవీ- ఇంజిన్ వివరాలు..

హుడ్ కింద, ఈ ఎంపీవీ ట్రైబర్‌లో అందించే 1.0-లీటర్, మూడు-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్ ఇంజిన్‌నే ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ 71 హెచ్​పీ పవర్​ని, 96 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 5-స్పీడ్ ఏఎంటి ఆటోమెటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్​ చేసి ఉంటుంది.

ప్రస్తుతానికి, నిస్సాన్ ఇతర పవర్‌ట్రైన్ ఎంపికలను ధృవీకరించలేదు.

నిస్సాన్ ప్రస్తుత కార్ల లైనప్..

ప్రస్తుతం భారతదేశంలో నిస్సాన్ లైనప్‌లో రెండు ఎస్‌యూవీలు ఉన్నాయి: మాగ్నైట్, ఎక్స్-ట్రైల్.

మాగ్నైట్ ధర రూ. 5.61 లక్షల నుంచి రూ. 8.47 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది.

ఎక్స్-ట్రైల్ ఒకే వేరియంట్‌లో రూ. 48.20 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో సేల్​లో ఉంది.

అయితే, ఫ్యామిలీ బయ్యర్స్​ని దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త ఎంపీవీని నిస్సాన్​ అందుబాటు ధరలోనే తీసుకురావొచ్చని అంచనాలు ఉన్నాయి. లాంచ్​ తర్వాత ఇది మారుతీ సుజుకీ ఎర్టిగాకు పోటీగా నిలుస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.