ఇక ఆర్టీసీ బస్సులో ఆధార్ కార్డు చూపాల్సిన అవసరం లేదు.. స్మార్ట్‌ కార్డ్ చూపిస్తే చాలు!

తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణంపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు స్మార్ట్ కార్డులను త్వరలో అందించేందుకు సిద్ధమైంది.

Published on: Dec 22, 2025, 09:37:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందిస్తున్న విషయం తెలిసిందే. లక్షల మంది మహిళలకు ఈ పథకం వరంగా మారింది. ప్రస్తుతం మహిళలు బస్సులో వెళ్తుంటే కండక్టర్‌కు ఆధార్ కార్డు చూపించి.. జీరో టికెట్ తీసుకుంటున్నారు. అయితే ఈ విధానానికి ఆర్టీసీ గుడ్‌బై చెప్పనుంది. ఇకపై స్మార్ట్ కార్డులను చూపిస్తే సరిపోతుంది.

తెలంగాణ ఆర్టీసీ స్మార్ట్ కార్డులు
తెలంగాణ ఆర్టీసీ స్మార్ట్ కార్డులు

మహిళలకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఇందులో కోసం సెంటర్ ఫర్ గుడ్‌ గవర్నెన్స్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. అతి త్వరలో మహిళలకు ఈ స్మార్ట్ కార్డులను రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. దీంతో ప్రయాణం ఈజీ కానుంది.

ఆధార్ కార్డు కారణంగా చాలాసార్లు కండక్టర్, మహిళల మద్య వాగ్వాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. కొందరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోవడంతో ఆంధ్రప్రదేశ్ అని చూపిస్తుంది. ఆధార్ కార్డు మీది కాదు అని, పొటో సరిగా కనిపించక.. ఇలా అనేక సమస్యలు కొన్నిసార్లు ఎదురవుతున్నాయి. స్మార్ట్ కార్డుతో వీటన్నింటికీ చెక్ పడనుంది.

ప్రజాభవన్‌లో ఆర్టీసీ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అర్హులైన మహిళలకు త్వరగా స్మార్ట్ కార్డులు చేరేలే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. త్వరలో పీఎం ఈ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌కు 2800 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని మంత్రులు వెల్లడించారు. వరంగల్‌కు 100 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 252 కోట్ల ప్రయాణాలు జరిగాయన్నారు.

నిజానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు ప్రయాణానికి స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టడం ద్వారా తన టిక్కెట్లు, పాస్ వ్యవస్థను ఆధునీకరించడానికి సిద్ధమవుతోంది. విద్యార్థులకు కూడా బస్ పాస్‌ల బదులుగా స్మార్ట్ కార్డులను తీసుకు వచ్చే ఆలోచనలో ఉంది. ఈ విధానం దశలవారీగా అమలు చేయడానికి ప్రణాళికలు వేస్తోంది.

TGSRTC బస్ పాస్‌లను పొందడం, పునరుద్ధరించే ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా చేయాలని భావిస్తోంది. ఇది డిజిటల్ టెక్నాలజీకి అనుగుణంగా మారడానికి వీలు కల్పిస్తుంది. ఇతర రాష్ట్రాల నమూనాలపై అధ్యయనం కూడా జరిగింది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఈ స్మార్డ్ కార్డు విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ విధానం తెలంగాణలోని ప్రయాణికులకు ఉత్తమ అనుభవాన్ని అందించనుంది. రాబోయే నెలల్లో ఈ పథకాన్ని దశలవారీగా అమలు చేయాలని భావిస్తున్నారు. 2026లో స్మార్ట్ కార్డులు పంపిణీ మెుదలు కావొచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More