...
...
Next Story

TGSRTC Bus Charges : ఆ బస్సుల్లో 40 శాతం ఛార్జీలు తగ్గింపు.. టీజీఎస్ఆర్టీసీ నిర్ణయం

TGSRTC Bus Charges : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు నడిచే పుష్పక్‌ ఏసీ బస్సుల ఛార్జీలను టీజీఎస్‌ఆర్టీసీ భారీగా తగ్గించింది. 40 శాతం వరకు ఛార్జీ తగ్గిస్తూ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 7 నుంచే కొత్త ఛార్జీలు అమలులోకి వచ్చాయి.

Published on: Oct 7, 2026, 18:24:23 IST
Advertisement

జూన్ 2025లో టికెట్ ధరల పెంపుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై చర్చ నడిచింది. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ శివార్లలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) నడిచే పుష్పక్ ఏసీ బస్సుల ఛార్జీలను 40 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సవరించిన ధరలు అక్టోబర్ 7 నుండి అమల్లోకి వస్తాయి.

టీజీఎస్ఆర్టీసీ
టీజీఎస్ఆర్టీసీ

మియాపూర్ నుండి ఎయిర్‌పోర్ట్‌కు నడిచే సర్వీసుల విషయానికొస్తే.. మియాపూర్ క్రాస్‌రోడ్స్ నుండి ఛార్జీని రూ.350 నుండి రూ.250కి, JNTU నుండి ఛార్జీని రూ.350 నుండి రూ.200కి తగ్గించారు. అలాగే శిల్పారామం నుండి ఛార్జీని రూ.300 నుండి రూ.200కి, గచ్చిబౌలి నుండి ఛార్జీని రూ.300 నుండి రూ.150కి తగ్గించారు.

అదేవిధంగా లింగంపల్లి నుండి విమానాశ్రయానికి నడిచే పుష్పక్ సర్వీసుల ఛార్జీలను కూడా తగ్గించారు. లింగంపల్లి నుండి ఛార్జీని రూ.300 నుండి రూ.200కి, అల్విన్ ఎక్స్-రోడ్ నుండి రూ.350 నుండి రూ.200కి తగ్గించారు. కొండాపూర్ నుండి ఛార్జీని రూ.300 నుండి రూ.200కి తగ్గించగా, కొత్తగూడ, గచ్చిబౌలి వద్ద బస్సు ఎక్కే ప్రయాణికులు ఇకపై రూ.300కి బదులుగా రూ.150 చెల్లిస్తే సరిపోతుంది.

గత ఏడాది టీజీఎస్ఆర్టీసీ అంతర్గత చర్చల తర్వాత ఛార్జీలు పెంటారు. అప్పట్లో, ధరలలో మార్పు లేకపోవడం, బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటం వంటి అంశాలు నిర్వహణ వ్యయాలపై ప్రభావం చూపుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఎయిర్‌పోర్ట్‌కు రాకపోకలు సాగించే ప్రయాణికులు తగ్గించిన ఛార్జీలను ఉపయోగించుకోవాలని అధికారులు కోరారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, చౌకైన ప్రజా రవాణా అందించాలని తమ ఉద్దేశమని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ చేసే పుష్పక్ బస్సు సర్వీసుల్లో ఛార్జీల తగ్గింపులతో ప్రయాణికులకు భారం తగ్గనుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks