TGSRTC : భక్తుల ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు - రూ. 151కే బుకింగ్...!
శ్రీరామనవమి వేళ భద్రాచలంలో నిర్వహించే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది.
శ్రీరామనవమి వేళ భద్రాచలంలో నిర్వహించే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది. మార్చి 27న శ్రీసీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను… హోం డెలివరీ చేయనుంది. ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది.

ఈనెల 23 నుంచి బుకింగ్స్…
ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఆవిష్కరించారు. కేవలం రూ.151 చెల్లించడం ద్వారా స్వామి వారి కళ్యాణ తలంబ్రాలను భక్తులు తమ ఇంటి వద్దే పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ-సేవల కోసం భక్తులు ముందస్తుగా… ఫిబ్రవరి 23వ తేదీ నుంచి వెబ్ సైట్ (http://tgsrtclogistics.co.in) ద్వారా సమీపంలోని టీజీఎస్‌ఆర్‌టీసీ లాజిస్టిక్స్‌కౌంటర్లలో బుక్ చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. మరింత సమాచారం కోసం 040-69440069, 040-23450033 నెంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. అయితే భద్రాద్రిలో జరిగే వేడుకలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. శ్రీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కల్యాణతంతును చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు.
ప్రభుత్వం తరుపున మంత్రులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు. కల్యాణ మహోత్సవం జరిగిన తర్వాత రోజు రామయ్యకు మహాపట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఇక్కడ జరిగే వేడుకల కోసం ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తుంది.
శ్రీ సీతారాముల కల్యాణాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు భద్రాచలం చేరుకుని.. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి అనుగ్రహాన్ని పొందుతారు. ఇక రకరకాల కారణాల వల్ల చాలా మంది భక్తులు భద్రాచలం రాలేకపోతారు. అయితే అలాంటి భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీజీఎస్ ఆర్టీసీ ) గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోంది. భద్రాచలం రాములోరి కళ్యాణ తలంబ్రాలను.. నేరుగా బుక్ చేసుకున్న వారి ఇంటి వద్దకే చేరవేస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా బుకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

