...
...
Next Story

Bhadrachalam : నేత్రపర్వంగా శ్రీరాముని పట్టాభిషేకం

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది. వేలాది మంది భక్తుల సమక్షంలో జయ జయ నీరాజనాల మధ్య దేవదేవుడికి అర్చకులు సమస్త నదీ జలాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ పాల్గొన్నారు.

Published on: Mar 28, 2026, 16:31:47 IST
Advertisement

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించిన శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు.

మార్మోగిన రామనామం…

శ్రీరాముని పట్టాభిషేకం
శ్రీరాముని పట్టాభిషేకం

వేద మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా నిర్వహించిన పట్టాభిషేక వేడుకలు భక్తులను ఆకట్టుకున్నాయి. దేశ నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తులతో మిథిలా ప్రాంగణం రామనామ స్మరణలతో మార్మోగింది. వసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే వెంకట్రావు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఈ ఉత్సవాన్ని తిలకించారు.

జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ…. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల సమన్వయంతో తాగునీరు, ప్రసాదాలు, వైద్య సదుపాయాలు, భద్రత వంటి అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టినట్లు తెలిపారు.

గిరి మార్ట్‌ ప్రారంభం:

భద్రాచలంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన గిరి మార్ట్‌ను రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల సతీసమేతంగా ప్రారంభించారు. గిరిజనుల ఆర్థికాభివృద్ధి, వారి ఉత్పత్తులకు స్థిరమైన మార్కెట్ కల్పించడం లక్ష్యంగా ఈ గిరి మార్ట్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

గిరి మార్ట్‌లో అడవి ఉత్పత్తులు, సేంద్రీయ ఆహార పదార్థాలు, గిరిజన హస్తకళా వస్తువులను ఒకే వేదికపై విక్రయానికి అందుబాటులో ఉంచారు. దీనివల్ల గిరిజనులకు నేరుగా ఆదాయం లభించి, మధ్యవర్తుల ప్రభావం తగ్గుతుందని తెలిపారు.

అనంతరం గవర్నర్ గిరి మార్ట్‌లో ఉంచిన ఉత్పత్తులను పరిశీలించారు. వాటి ప్రత్యేకతలు, తయారీ విధానం, మార్కెటింగ్ సదుపాయాల గురించి జిల్లా కలెక్టర్ అంకిత్ గారిని అడిగి తెలుసుకున్నారు. గిరిజన కళలు, ఉత్పత్తులకు ఇది మంచి ప్రోత్సాహక వేదికగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe