తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. కాజీపేట - కొండపల్లి సెక్షన్‌లోని డోర్నకల్ - గుండ్రాతిమడుగు స్టేషన్ల మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణ పనుల నిమిత్తం నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పనుల కారణంగా ఆగస్టు 2026 నెలలో పలు రూట్లలో నడిచే రైళ్లను డైవర్ట్ చేయడంతో పాటు, మరికొన్ని రైళ్ల సమయాలను రీషెడ్యూల్ చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
రూట్ మారిన ట్రైన్లు

విశాఖపట్నం - LTT ముంబై (18519/18520): ఆగస్టు 14 నుండి 18 వరకు ఈ రైళ్లు విజయవాడ, గుంటూరు మీదుగా డైవర్ట్ అయ్యాయి. దీనివల్ల కాజీపేట స్టేషన్‌లో వీటికి స్టాపింగ్ ఉండదు.
సీఎస్టీ ముంబై - భువనేశ్వర్ (11019/11020): ఆగస్టు 17, 18 తేదీల్లో నడిచే ఈ రైళ్లను డైవర్ట్ చేశారు. విజయవాడ, గుంటూరు, పగిడిపల్లి, సికింద్రాబాద్ మీదుగా వెళ్తాయి. కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర స్టేషన్లలో ఈ రైళ్లు ఆగవు.
మచిలీపట్నం - సాయినగర్ షిరిడీ (17208): ఆగస్టు 18న నడిచే ఈ రైలు డైవర్ట్ అయింది. మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, కాజీపేట స్టాపింగ్‌లు రద్దయ్యాయి.
సాయినగర్ షిరిడీ - కాకినాడ పోర్ట్ (17205): ఆగస్టు 18న ఈ రైలు సికింద్రాబాద్ - పగిడిపల్లి - గుంటూరు - విజయవాడ మీదుగా వెళ్తుంది. కాజీపేట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిరలలో ఆగదు.
చర్లపల్లి - షాలిమార్ (18046): ఆగస్టు 18, 19 తేదీల్లో ఈ రైలు చర్లపల్లి - పగిడిపల్లి - గుంటూరు - విజయవాడ మీదుగా మళ్లిస్తారు. భువనగిరి, ఆలేరు, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్ స్టాప్‌లు ఉండవు.
రేణిగుంట - నిజాముద్దీన్ (00761): ఆగస్టు 14, 15, 17 తేదీల్లో ఈ రైలు రేణిగుంట - గూటి - కాచిగూడ - మౌలా అలీ 'G' - కాజీపేట - బల్హర్షా మీదుగా డైవర్ట్ అయింది. దీనికి గూడూరు, విజయవాడ స్టాపింగ్‌లు రద్దయ్యాయి.
రైళ్ల రీషెడ్యూల్ వివరాలు
{{/usCountry}}రేణిగుంట - నిజాముద్దీన్ (00761): ఆగస్టు 14, 15, 17 తేదీల్లో ఈ రైలు రేణిగుంట - గూటి - కాచిగూడ - మౌలా అలీ 'G' - కాజీపేట - బల్హర్షా మీదుగా డైవర్ట్ అయింది. దీనికి గూడూరు, విజయవాడ స్టాపింగ్‌లు రద్దయ్యాయి.
రైళ్ల రీషెడ్యూల్ వివరాలు
{{/usCountry}}విశాఖపట్నం - సికింద్రాబాద్ (20833): ఆగస్టు 15, 17, 19 తేదీల్లో 60 నిమిషాలు ఆలస్యం.
సికింద్రాబాద్ - విశాఖపట్నం (20834): ఆగస్టు 15, 17, 19 తేదీల్లో 60 నిమిషాలు ఆలస్యం.
హైదరాబాద్ - తాంబరం (12760), సికింద్రాబాద్ - తిరుపతి (12764): ఆగస్టు 17న 60 నిమిషాలు ఆలస్యం.
బనారస్ - రామేశ్వరం (22536), రామేశ్వరం - అయోధ్య కాంట్ (22613): ఆగస్టు 16న 60 నిమిషాలు ఆలస్యం.
ఆదిలాబాద్ - తిరుపతి (17406): ఆగస్టు 15, 17, 18 తేదీల్లో 75 నిమిషాలు ఆలస్యం.
తిరుపతి - హిసార్ (04718), హైదరాబాద్ - విశాఖపట్నం (12728): ఆగస్టు 17న 75 నిమిషాలు ఆలస్యం.
న్యూఢిల్లీ - చెన్నై సెంట్రల్ (12622): ఆగస్టు 16న 75 నిమిషాలు ఆలస్యం.
ప్రయాణికులు పైన పేర్కొన్న స్టేషన్ల మళ్లింపులు, సమయాల మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.