...
...
Next Story

ఇదీ హైదరాబాద్ అంటే.. న్యూ ఇయర్ నైట్‌పై సజ్జనార్ కామెంట్స్

హైదరాబాద్ ప్రజలపై సీపీ సజ్జనార్ ప్రశంసలు కురిపించారు. నూతన సంవత్సరం వేళ ప్రజలు ఎంతో బాధ్యతయుతంగా ప్రవర్తించారని చెప్పారు.

Updated on: Jan 01, 2026 11:34 AM IST
Advertisement

న్యూ ఇయర్ 2026కు అంతా స్వాగతం పలికారు. అయితే ఈసారి హైదరాబాద్ పోలీసులు ఎటువంటి ఘటనలు జరగకుండా.. ముందస్తుగానే కఠిన ఆంక్షలు విధించారు. ఎలాంటి ప్రమదాలు జరగకూడదని ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. పబ్బులు, క్లబ్బుల దగ్గర నుంచి తాగి వాహనాలు నడపొద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జరిమానాలు భారీగా ఉంటాయని చెప్పారు. దీంతో జనాలు కూడా జాగ్రత్తగా న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

హైదరాబాద్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
హైదరాబాద్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. నగరంలో ఎటువంటి సంఘటనలు లేకుండా నూతన సంవత్సర వేడుకలు జరిగాయని, పెద్ద ప్రమాదాలు ఏవీ జరగలేదని హైదరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు. పోలీసుల కఠినమైన ఆంక్షలు, నగరం అంతటా అవగాహన ప్రచారాలతో సురక్షితంగా న్యూ ఇయర్ జరుపుకొన్నారని సజ్జనార్ చెప్పారు.

రోడ్డు భద్రతను నిర్ధారించడంలో పోలీసులు, పౌరుల సమిష్టి కృషిని సీపీ సజ్జనార్ ప్రశంసించారు. మద్యం తాగి వాహనాలు నడపడంపై చర్యలు, ప్రభావవంతమైన అవగాహన కార్యక్రమాలు ప్రమాదాలను నివారించడంలో కీలక పాత్ర పోషించాయని అన్నారు.

'ఇది యాదృచ్ఛికంగా జరగలేదు. అవగాహన పనిచేసింది, బాధ్యత గెలిచింది, ప్రజా సహకారం గొప్పది. హైదరాబాద్‌ను సురక్షితమైన ప్రపంచ నగరంగా మార్చడానికి పౌరులు కలిసి పనిచేయాలి.' అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు.

రోడ్డు భద్రత సందేశాన్ని సజ్జనార్ బలంగా చెప్పారు. వేడుకలకు ఎప్పుడూ ప్రాణాలను పణంగా పెట్టకూడదని, మద్యం మరియు డ్రైవింగ్ ఎప్పుడూ కలిసి ఉండకూడదని గుర్తు చేశారు. ప్రమాదాలు లేని వేడుకలు సాధ్యమేనని నగరం చూపించిందన్నారు. హైదరాబాద్‌ను మరింత సురక్షితమైన, గ్లోబల్ సిటీగా మార్చేందుకు కలిసి ముందుకు సాగుదాం.. హైదరాబాద్ నేర్పింది ఒక్కటే.. రిస్క్ లేకుండా సెలబ్రేషన్ ఉండొచ్చు అని సజ్జనార్ అన్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe