TGPSC OTR : టీజీపీఎస్సీ ఓటీఆర్‌పై కీలక అప్డేట్.. మిగిలింది మరికొన్ని రోజులే
TGPSC OTR Update : టీజీపీఎస్సీ ఓటీఆర్ అప్డేషన్ కోసం మరికొన్ని రోజులే మిగిలింది. మార్చిలోనే ఈ ప్రక్రియ ముగుస్తుంది. మరోసారి అవకాశం ఉండదని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ఓటీఆర్ అప్డేట్ అవకాశాన్ని పొడిగించిన విషయం తెలిసిందే. నిజానికి ఫిబ్రవరి 25వ తేదీన ముగియాల్సి ఉంది. కానీ అభ్యర్థుల సౌలభ్యం కోసం మార్చి 25వ తేదీ వరకు పొడిగించింది. అయితే ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేసింది. తాజాగా అభ్యర్థులకు ఈ విషయాన్ని గుర్తుచేస్తూ సర్వీస్ మెసేజ్‌లను పంపిస్తోంది టీజీపీఎస్సీ.

'అందరు అభ్యర్థులు జనవరి 17 నాటి వెబ్‌నోట్ ప్రకారం నిర్దేశించిన గడువు(25/03/2026)లోగా ఓటీఆర్ వివరాలను సరిచూసుకొని సరైన వివరాలను మాత్రమే నమోదు చేసుకోగలరు. సంబంధిత ధ్రువ పత్రాలను అప్‌లోడ్ చేయగలరు. తదుపరి ఎలాంటి అవకాశం ఉండదు. రానున్న రిక్రూట్‌మెంట్‌లలో ఇట్టి డేటాను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.' అని టీజీపీఎస్సీ తాజాగా అభ్యర్థులకు సర్వీస్ మెసేజ్‌లు పంపింది.
ఇవీ చేయాలి
తప్పనిసరిగా కొత్త కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంబంధిత సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి. అదనపు విద్యార్హతలు, చిరునామా , ఈడబ్యూఎస్, నాన్-క్రీమీ లేయర్ , మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీలను మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది. మిగిలిన వివరాలు మార్చడానికి వీలుండదని టీజీపీఎస్సీ పేర్కొంది. అభ్యర్థులు ఇచ్చే ఓటీఆర్ వివరాలనే భవిష్యత్తులో ఉద్యోగ దరఖాస్తులకు ప్రాథమిక సమాచారంగా చూస్తారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే ఉద్యోగ నోటిఫికేషన్లకు అప్లై చేయాలనుకునే వారు తప్పనిసరిగా ఓటీఆర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, ఫోటో, సంతకం వంటివి ఒక్కసారి మాత్రమే నమోదు చేసుకునే ప్రక్రియ. దీనివల్ల ప్రతిసారీ వివరాలు నింపాల్సిన అవసరం లేకుండా, ఉద్యోగ నోటిఫికేషన్‌కు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రతి అభ్యర్థికి ఒకే ఓటీఆర్ ఉంటుంది. ఇది ఏ కారణం చేతనైనా అభ్యర్థి లేదా కమిషన్ రద్దు చేసే వరకు చెల్లుతుంది. అభ్యర్థి అదనపు అర్హతలు, కరస్పాండెన్స్ చిరునామా, కమ్యూనికేషన్ మార్పులు, ఈడబ్ల్యూఎస్ స్టేటస్, కేటగిరీకి సంబంధించిన వివరాలను అప్‌లోడ్ చేయడం ద్వారా అతని/ఆమె డేటాను యాడ్ చేయవచ్చు, మెరుగుపరచవచ్చు అని కూడా కమిషన్ తెలిపింది.
ఎలా అప్‌డేట్ చేయాలి?
అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in సందర్శించండి.
TSPSC/OTR ID, జననం తేదీ ఉపయోగించి లాగిన్ చేయాలి.
Edit/Update ఓటీఆర్ సెక్షన్ వెళ్లండి. మీరు రిప్లేస్ చేసిన వ్యక్తిగత, విద్య, కేటగిరీ వివరాలను చెక్ చేయండి.
కొన్నీ మిస్ అయిన అర్హతలు లేదా తాజా సర్టిఫికేట్లను, కొత్త పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో జత చేయండి.
వివరాలను, డాక్యుమెంట్లను చెక్ చేసి, ఓటీఆర్ అప్డేట్ సబ్మిట్ చేయండి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


