హైదరాబాద్‌లో భూమి కంపించడానికి కారణం ఇదే.. హైడ్రో సెస్మిసిటీ అంటే ఏమిటి?
అక్టోబర్ 27న సౌత్‌వెస్ట్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఈ సమయంలో భారీ శబ్ధం వినిపించింది. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది.
హైదరాబాద్ నగరంలోని సౌత్‌వెస్ట్ ప్రాంత వాసులను అక్టోబర్ 27 ఒక విచిత్రమైన శబ్ధం భయాందోళనకు గురిచేసింది. ఆకస్మికంగా భూమి కంపించడమే కాకుండా, భారీ పేలుడు వంటి శబ్దాలు వినపడటంతో స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అయితే ఇది సాధారణ టెక్టోనిక్ భూకంపం కాదని, నీటి ఊటల కారణంగా సంభవించే హైడ్రో-సెస్మిసిటీ(Hydro-seismicity) అని నిపుణులు స్పష్టం చేశారు.

నగరంలోని రాజేంద్రనగర్, ఉప్పర్‌పల్లి, అత్తాపూర్, ఎర్రబోడ, కేశవస్వామి నగర్, లంగర్‌హౌజ్ వంటి ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. గాలిలో లేదా భూమి అంతర్భాగంలో భారీ పేలుడు జరిగినట్లు వింత శబ్దాలు రావడం, దానికి తోడు నివాసాలు కదలడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ముఖ్యంగా ఎత్తైన భవనాల్లో నివసించే వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఏమిటీ హైడ్రో-సెస్మిసిటీ?
హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI) శాస్త్రవేత్తలు ఈ ఘటనపై స్పందిస్తూ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. ఇది టెక్టోనిక్ భూకంపం కాదని వివరించారు. భారీ వర్షాల సమయంలో నీరు భూమి లోతుల్లోకి ఇంకి, గ్రెనైట్ రాతి పొరల్లో ఉండే చిన్న చిన్న రంధ్రాలు, క్రాక్స్‌లోకి చేరుతుంది. రాళ్ల నడుమ ఇరుక్కుపోయిన వర్షపు నీరు, గాలి తీవ్ర ఒత్తిడికి గురవుతాయి.
ఒత్తిడి పెరిగినప్పుడు భూమి లోపలి రాళ్ల పగుళ్ల వద్ద ఆకస్మిక కదలికలు ఏర్పడతాయి. ఈ క్రమంలో శక్తి ఒక్కసారిగా విడుదల కావడం వల్ల భూకంపం లాంటి ప్రకంపనలు, శబ్దాలు వస్తాయి. హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వినాశకరమైన భూకంపాల ముప్పు చాలా తక్కువ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
హైదరాబాద్ అత్యంత దృఢమైన స్పటికాకార గ్రెనైట్(Crystalline Granite) పొరలపై ఉంది. దీనివల్ల పెద్ద భూకంపాలు వచ్చే అవకాశం దాదాపు లేదనే చెప్పవచ్చు. భారతదేశాన్ని భూకంప ముప్పు ఆధారంగా జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 అనే నాలుగు విభాగాలుగా వర్గీకరించారు.
జోన్ 2 (తక్కువ ప్రమాదం): హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని మెజారిటీ జిల్లాలు జోన్ 2 పరిధిలోకి వస్తాయి. అందుకే ఇక్కడ అత్యంత స్వల్ప స్థాయి కంపనాలు మాత్రమే నమోదవుతాయి. జోన్ 3 (మధ్యస్థ ప్రమాదం): తెలంగాణలోని కొన్ని తూర్పు ప్రాంతాలు మాత్రం మధ్యస్థ ముప్పు ఉండే జోన్ 3 కిందకు వస్తాయి.
ప్రస్తుతం నమోదైన ప్రకంపనలు కేవలం స్థానిక భౌగోళిక మార్పుల వల్ల (హైడ్రో-సెస్మిసిటీ) వచ్చినవే తప్ప, పెద్ద ప్రమాదానికి సంకేతం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


