విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాఠశాలలకు వరుసగా మూడు రోజులు సెలవులు!

ఆగస్టు నెలలో విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది. రెండో శనివారం, ఆదివారంతోపాటుగా బోనాల సెలవు వస్తే 3 రోజులు కానున్నాయి.

Updated on: Aug 6, 2026, 10:11:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్, ఇతర జిల్లాల్లోని పాఠశాలలు, విద్యాసంస్థలు ఈ నెలలో ఆగస్టు 8, 9, 10 తేదీలలో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది. బోనాల సందర్భంగా ఆగస్టు 10న విద్యాసంస్థలు మూసివేస్తారు. భాగ్యనగరంలో రంగం, పోతురాజు నృత్యాలు, ఊరేగింపుతో కూడిన ఘనమైన ముగింపు వేడుక జరుగుతుంది.

స్కూల్ హాలిడేస్
స్కూల్ హాలిడేస్

ఆగస్టు 9, 10 తేదీల్లోని సెలవులు వరుసగా రెండో శనివారం, ఆదివారాలకు సంబంధించినవి. ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 10వ తేదీ బోనాల పండుగకు సెలవు దినంగా ఉన్నప్పటికీ, దానిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సాధారణంగా సెలను ప్రకటిస్తారు. అయితే ప్రస్తుతం నిర్ణయం వెలువడిన తర్వాతే స్పష్టత రానుంది. ఆగస్టు 8, 9వ తేదీల్లో రెండో శనివారం, ఆదివారం కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ ఆఫీసులకు సాధారణంగా సెలవు ఉంటుంది.

బోనాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే రంగ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రతీ ఏటా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలతోపాటుగా మరికొన్ని ప్రాంతాల్లో స్థానికంగా సెలవు ఉంటుంది. ఈ సంవత్సరం కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉంది. సుదీర్ఘ వారాంతం రానుండటంతో, కుటుంబాలు బోనాల పండుగ కోసం ప్రణాళికలు వేసుకుంటున్నాయి.

ఆగస్టు 10న కూడా ప్రభుత్వం సెలవు ప్రకటిస్తే.. వరుసగా మూడు రోజులు విద్యార్థులకు సెలవులు వస్తాయి. బోనాల జాతర, లేదంటే ఎక్కడికైనా చిన్న టూర్ ప్లాన్ చేయవచ్చు. ఆగస్టు నెలలో రాష్ట్రంలోని విద్యాసంస్థలు 11 రోజుల పాటు మూసి ఉండే అవకాశం ఉంది. వీటిలో ఐదు ఆదివారాలు, మూడు ఐచ్ఛిక సెలవులు, మూడు సాధారణ సెలవులు ఉన్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More