...
...
Next Story

మూడు వీక్లీ అంతర్-రాష్ట్ర ఎక్స్‌ప్రెస్ రైళ్లను రెగ్యులరైజ్ చేసిన రైల్వే శాఖ!

తిరుచ్చి మీదుగా నడిచే మూడు అంతర్-రాష్ట్ర వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రైల్వే శాఖం రెగ్యులర్ చేసింది. ఈ మేరకు తాజాగా వివరాలు ప్రకటించింది.

Published on: Mar 19, 2026 07:01 PM IST
Advertisement

తిరుచ్చి మీదుగా నడిచే మూడు అంతర్-రాష్ట్ర వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రైల్వే యంత్రాంగం రెగ్యులర్ చేసింది.

  • అవి: ఎర్నాకులం జంక్షన్-వేలాంకన్ని-ఎర్నాకులం జంక్షన్ ఎక్స్‌ప్రెస్
  • హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
  • కాచిగూడ-ట్యుటికోరిన్-కాచిగూడ ఎక్స్‌ప్రెస్

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఎర్నాకులం జంక్షన్-వేలాంకన్ని వీక్లీ ఎక్స్‌ప్రెస్ (16363) సాధారణ సేవలు మార్చి 18 నుండి ప్రారంభమయ్యాయి. అలాగే వేలాంకన్ని-ఎర్నాకులం జంక్షన్ ఎక్స్‌ప్రెస్ (16364) సాధారణ సేవలు మార్చి 19న మొదలయ్యాయి. ఎర్నాకులం జంక్షన్-వేలాంకన్ని వీక్లీ ఎక్స్‌ప్రెస్ (16363) బుధవారం రాత్రి 11:50 గంటలకు ఎర్నాకులం జంక్షన్ నుండి బయలుదేరి, గురువారం సాయంత్రం 5:35 గంటలకు వేలాంకన్ని చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో వేలాంకన్ని-ఎర్నాకులం జంక్షన్ ఎక్స్‌ప్రెస్ (16364) గురువారం రాత్రి 7:45 గంటలకు వేలాంకన్ని నుండి బయలుదేరి, శుక్రవారం ఉదయం 11:55 గంటలకు ఎర్నాకులం చేరుకుంటుంది.

ఇక హైదరాబాద్-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ సాధారణ సేవలు హైదరాబాద్ నుండి ఏప్రిల్ 1 నుండి, కన్యాకుమారి నుండి ఏప్రిల్ 3 నుండి అమల్లోకి వస్తాయి. హైదరాబాద్-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ (17069) బుధవారం సాయంత్రం 4:45 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి, శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు కన్యాకుమారి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17070) శుక్రవారం ఉదయం 5:15 గంటలకు కన్యాకుమారి నుండి బయలుదేరి, శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

కాచిగూడ-ట్యుటికోరిన్ ఎక్స్‌ప్రెస్ సాధారణ సేవలు కాచిగూడ నుండి ఏప్రిల్ 6 నుండి, ట్యుటికోరిన్ నుండి ఏప్రిల్ 8 నుండి ప్రారంభమవుతాయి. కాచిగూడ-ట్యుటికోరిన్ ఎక్స్‌ప్రెస్ (17615) సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడ నుండి బయలుదేరి, మంగళవారం రాత్రి 10:30 గంటలకు ట్యుటికోరిన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(17616) బుధవారం ఉదయం 7.40 గంటలకు తూత్తుకుడి నుండి బయలుదేరి, గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

అధికారుల ప్రకటన ప్రకారం, హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్, కాచిగూడ-తూత్తుకుడి-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైళ్లు తంజావూరు, కుంభకోణం మీదుగా వెళ్లే ప్రధాన మార్గం ద్వారా నడుస్తాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe