రెండు నెలలకు పైగా ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాలకు, అలాగే తెలంగాణ అటవీ శాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది ఓ పెద్దపులి. అయితే ఇది మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ నుంచి వచ్చిందని అందరూ భావించారు. కానీ ఈ పులి తిపేశ్వర్ అభయారణ్యం నుండి వచ్చింది కాదు.

మహారాష్ట్ర అటవీ అధికారులు పెద్దపులి తిప్పేశ్వర్ నుండి వచ్చినది కాదని నిర్ధారించారు. పులి చిత్రాన్ని.. తమ దగ్గర ఉన్న డేటాబేస్‌తో సరిపోల్చారు. ఇది ఇక్కడి నుండి వెళ్లిందని కాదని.. అని తిప్పేశ్వర్ అభయారణ్యం పరిధిలోకి వచ్చే మెల్‌ఘాట్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ ఆదర్శ్ అన్నారు.
తడోబా-అంధారి టైగర్ రిజర్వ్, దాని పరిసరాల నుండి వచ్చిన పెద్ద పులితో ఇది సరిపోతుందో లేదో చూడటానికి దీని చిత్రాన్ని చంద్రపూర్ అటవీ అధికారులకు పంపారు. చంద్రపూర్ జిల్లాలో పులుల అభయారణ్యం వెలుపల, గ్రామాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో 150 కి పైగా పులులు సంచరిస్తున్నాయి.
తెలంగాణ అటవీ అధికారులు మొదట్లో ఆ పులి తిపేశ్వర్ అభయారణ్యం నుండి కవ్వాల్ టైగర్ రిజర్వ్‌కు దాటిందిగా భావించారు. తరువాత ఈ మగ పులి ఐదు సంవత్సరాల వయస్సు గలది అని నిర్ధారించారు. రెండు నెలల క్రితం కవ్వాల్ నుండి మంచిర్యాలకు చేరుకుందని, అప్పటి నుండి ఉత్తర తెలంగాణలో సంచరిస్తూనే ఉందని చెబుతున్నారు.
ఇప్పటివరకు మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, యాదాద్రి-భువనగిరి, జనగాం, ఇతర జిల్లాల్లో దాని కదలికలు కనిపించాయి. ఇది పశువులను మాత్రమే చంపి తిన్నట్టుగా గుర్తించారు. పంట పొలాలకు వెళ్లే రైతులలో భయాందోళనలను సృష్టిస్తోంది ఈ పులి. అధికారిక సమాచారం ప్రకారం, ఇది ఇప్పుడు సిద్దిపేట జిల్లాలోని అటవీయేతర ప్రాంతాలలో సంచరిస్తోంది. సిద్దిపేట జిల్లా కోహెడ సమీపంలోని సింగరాయగుట్ట సమీపంలో పులిని నైట్ విజన్ కెమెరా ట్రాప్‌లు గుర్తించాయి. దీనితో సమీప ప్రాంతాలలో హెచ్చరిక జారీ చేశారు అధికారులు.
జాతీయ పులుల సంరక్షణ సంస్థ, వన్యప్రాణుల స్వచ్ఛంద సంస్థల అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ ఈ పెద్దపులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. థర్మల్ ఇమేజింగ్ డ్రోన్లు, కెమెరా ట్రాప్లను ఉపయోగించడం, పగ్ గుర్తులు, ఇతర గుర్తులను పరిశీలిస్తూ.. పులి సంచరించే ప్రదేశాల్లో జనాలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఈ పులి ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసుకోవాల్సి ఉంది.
{{/usCountry}}జాతీయ పులుల సంరక్షణ సంస్థ, వన్యప్రాణుల స్వచ్ఛంద సంస్థల అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ ఈ పెద్దపులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. థర్మల్ ఇమేజింగ్ డ్రోన్లు, కెమెరా ట్రాప్లను ఉపయోగించడం, పగ్ గుర్తులు, ఇతర గుర్తులను పరిశీలిస్తూ.. పులి సంచరించే ప్రదేశాల్లో జనాలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఈ పులి ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసుకోవాల్సి ఉంది.
{{/usCountry}}ఫిబ్రవరి 8 నాటికి సిద్దిపేట జిల్లాలోని ఆరెపల్లి సమీపంలో పులి ఉనికిని ట్రాకింగ్ బృందాలు గుర్తించాయి. ఉత్తర దిశలో కదులుతున్నట్లు.. బహుశా కవాల్ టైగర్ రిజర్వ్ వైపు వెళ్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. స్థానిక రైతులు ప్రత్యక్షంగా చూడటమే కాదు.. ఫిబ్రవరి 6, 7 తేదీలలో పగ్‌మార్క్‌లు కూడా గుర్తించారు. ఉత్తర తెలంగాణలో ఈ పులి సంచారం చర్చనీయాంశమైంది.