'యూరియా' పంపిణీలో ఇబ్బందులా..? టోల్ ఫ్రీ నెంబర్ ఇదిగో

రాష్ట్ర వ్యాప్తంగా యూరియా పంపిణీ కొనసాగుతోంది. ఈసారి యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ కూడా తీసుకొచ్చారు. అయితే యూరియా పంపిణీలో ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా వ్యవసాయశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.

Published on: Dec 31, 2025, 12:03:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో యూరియా సరఫరా కొనసాగుతోంది. అయితే ఈసారి ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. యూరియా కొనుగోలును సులభతరం చేయుటకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫెర్టిలైజర్ బుకింగ్ మొబైల్ యాప్ ను ప్రవేశపెట్టింది.

యూరియా పంపిణీ
యూరియా పంపిణీ

గతంలో ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ పంపిణీ కార్యక్రమాలన్నీ కూడా జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. యూరియా అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇదే విషయంపై ఇప్పటికే అధికార యంత్రాగానికి కూడా కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారు.

రాష్ట్ర స్థాయి టోల్ ఫ్రీ నెంబర్

ఇక యూరియా పంపిణీలో ఏవైనా సమస్యలు ఉంటే రాష్ట్ర స్థాయి టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా వ్యవసాయశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. 18005995779 నెంబర్ ను సంప్రదించవచ్చని సూచించింది. ఇక జిల్లాల వారీగా కూడా వేర్వురు నెంబర్లను అందుబాటులో ఉంచారు. రైతులు యూరియా అందుబాటు పైన మరియు ఫెర్టిల్జర్ బుకింగ్ అప్ పైన ఎలాంటి ఆందోళన చెందొద్దని… అధికారులు అన్ని వేళలా అందుబాటులో ఉంటారని వ్యవసాయశాఖ చెబుతోంది.

యూరియా కొరత లేదు - మంత్రి తుమ్మల

రాష్ట్రవ్యాప్తంగా యూరియా పంపిణీ ప్రశాంతంగా సాగుతోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల చెప్పారు.. రాష్ట్రంలో యాసంగికి యూరియా కొరత లేదన్నారు. మంగళవారం నాటికి 2.15 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉందని ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయవద్దని రైతులను కోరారు.

యాప్ ద్వారా బుకింగ్ - ప్రాసెస్ ఇలా:

ప్రభుత్వం రైతులు తమ స్మార్ట్‌ఫోన్ నుంచే ఎరువులు(ప్రస్తుతం యూరియా మాత్రమే అందిస్తారు) బుక్ చేసుకునేందుకు “Fertilizer Booking Mobile App”ను తీసుకొచ్చింది. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత లాగిన్ / రిజిస్ట్రేషన్ అవ్వాలి.

ఎలా లాగిన్ అవ్వాలి?

  1. మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.
  2. ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేయాలి.
  3. పట్టాదార్ పాస్‌బుక్ నంబర్ నమోదు చేయాలి.
  4. భూమి వివరాలు ఆటోమేటిక్‌గా యాప్‌లో చూపిస్తాయి.

సాగు చేస్తున్న పంట, సాగు విస్తీర్ణం (ఎకరాల్లో) పంట, భూమి ఆధారంగా మీకు అర్హమైన యూరియా బ్యాగుల సంఖ్య యాప్‌లో చూపిస్తుంది.అవసరమైన బ్యాగుల సంఖ్య ఎంటర్ చేసి మీ జిల్లాలోని డీలర్ షాప్‌ను ఎంపిక చేసి బుకింగ్ కన్ఫర్మ్ చేయాలి.

జిల్లా / మండలం / గ్రామాన్ని అన్నదాతలు ఎంపిక చేయాలి. అందుబాటులో ఉన్న యూరియా స్టాక్ వివరాలు వస్తాయి. సమీప డీలర్ షాప్‌ల జాబితా కనిపిస్తుంది. తర్వాత అవసరమైన యూరియా బ్యాగుల సంఖ్య ఎంపిక చేయాలి. బుకింగ్ పూర్తయ్యాక బుకింగ్ ఐడీ వస్తుంది. ఈ ఐడీ సాధారణంగా 24 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. డీలర్ దగ్గర యూరియా పొందడానికి బుకింగ్ ఐడీతో డీలర్ షాప్‌కు వెళ్లాలి. డీలర్ స్టాక్ చెక్ చేసి యూరియా బ్యాగులు ఇస్తారు. భూమి విస్తీర్ణం ఆధారంగా యూరియా స్పెల్స్ కేటాయింపు జరుగుతుంది.

పాస్‌బుక్ రైతుల యాప్‌లో లాగిన్ అయిన తర్వాత పాస్‌బుక్ నంబర్ ఎంటర్ చేయాలి. రైతు భరోసాకు అనుసంధానమైన ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేస్తే భూమి వివరాలు ఓపెన్ అవుతాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More