...
...
Next Story

హైదరాబాద్‌లో విషాదం.. గచ్చిబౌలిలో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి

హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో ఓ భవనం కూలింది. నాలా పక్కనే 50 గజాల స్థలంలో కొన్ని రోజుల కిందట నిర్మాణం చేసిన ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో ఇద్దరు మరణించారు.

Published on: Aug 22, 2026, 15:20:39 IST
Advertisement

హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ హబ్ గచ్చిబౌలి పరిధిలోని అంజయ్యనగర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాలాను ఆనుకుని కేవలం 50 గజాల విస్తీర్ణంలో అక్రమంగా నిర్మించినట్లు ఆరోపణలు వస్తున్న ఓ ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ప్రమాద తీవ్రతకు స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

కుప్పకూలిన భవనం
కుప్పకూలిన భవనం

కొత్తగా నిర్మాణం పూర్తి చేసుకుని, త్వరలోనే అద్దెకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం అకస్మాత్తుగా పక్కకు వాలిపోతూ కూలిపోయింది. ఈ క్రమంలో శిథిలాలు పక్కనే ఉన్న ఆపార్ట్‌మెంట్‌పై పడటంతో దాని గోడలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

భవనం కూలిన శబ్దానికి పక్కనే ఉన్న హాస్టల్‌లోని విద్యార్థులు, స్థానికులు తీవ్ర భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీల సాయంతో శిథిలాలను తొలగిస్తూ, ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. లోపల ఇంకెవరైనా చిక్కుకున్నారేమోనని పరిశీలిస్తున్నారు.

ఈ ఘటన రాత్రి లేదా సాయంత్రం వేళల్లో జరిగి ఉంటే, జనసంచారం ఎక్కువగా ఉండి భారీ స్థాయిలో ప్రాణనష్టం సంభవించి ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు.

మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో చిన్న చిన్న స్థలాల్లో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడం సాధారణంగా మారింది. 50 గజాల స్వల్ప స్థలంలో, అది కూడా నాలా పక్కన సరైన పునాదులు లేకుండా ఏడు అంతస్తులు నిర్మించడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై జీహెచ్‌ఎంసీ అధికారులు విచారణకు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన బిల్డర్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe