తెలంగాణలో ఆటో ఛార్జీలు పెంచుతూ రవాణాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆటో కనీస ఛార్జీ 1.6 కి.మీ వరకు రూ.30, కనీస ఛార్జీ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.14గా నిర్ణయించారు.

ప్రయాణికుల అవసరాలు, ఇంధన ధరల పెంపును పరిగణనలోకి తీసుకుని ఈ కొత్త ధరలను ఖరారు చేశారు. వివిధ జీవోల అనుభవాలు, రవాణా శాఖ కమిషనర్ సమర్పించిన నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2014 తర్వాత సుదీర్ఘ కాలం పిమ్మట ఆటో ఛార్జీలను మళ్లీ అధికారికంగా పెంచుతూ ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు ఇచ్చింది.
కొత్త ఆటో ఛార్జీల పూర్తి వివరాలు:
సవరించిన పట్టిక ప్రకారం నూతన రేట్లు ఈ క్రింది విధంగా అమలులోకి వస్తాయి. కనీస ఛార్జీ మొదటి 1.6 కిలోమీటర్ల వరకు కనీస ప్రయాణ ఛార్జీని రూ. 30 గా నిర్ణయించారు.
- అదనపు కిలోమీటరు ఛార్జీ : 1.6 కిలోమీటర్లు దాటిన తర్వాత సాగే ప్రయాణానికి ప్రతి కిలోమీటరుకు రూ. 14 చొప్పున వసూలు చేస్తారు.
- వెయిటింగ్ ఛార్జీలు : ప్రయాణంలో నిరీక్షణ సమయానికి (వెయిటింగ్) నిమిషానికి 75 పైసలు చెల్లించాల్సి ఉంటుంది.
- రాత్రి వేళ ప్రయాణ ఛార్జీలు : రాత్రి 11:00 గంటల నుంచి ఉదయం 5:00 గంటల మధ్య ప్రయాణించే ఆటోలకు సాధారణ ఛార్జీపై అదనంగా ఒకటిన్నర రెట్లు వసూలు చేయడానికి అనుమతి ఇచ్చారు.
ఆటోల్లో ప్రయాణికులు తీసుకెళ్లే లగేజీపై కూడా రవాణా శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లే బ్రీఫ్‌కేస్, హ్యాండ్‌బ్యాగ్…. లేదా 60x40 సెంటీమీటర్ల కంటే తక్కువ పరిమాణం ఉండే చిన్న బ్యాగులకు ఎలాంటి లగేజీ ఛార్జీలు ఉండవు. వీటిని మినహాయించి అదనంగా ఉండే ప్రతీ లగేజీ ప్యాకేజీకి ప్రయాణమంతటికీ కలిపి 50 పైసలు వసూలు చేస్తారు. ఒక ఆటోలో ప్రయాణికులు తమతో పాటు గరిష్టంగా 100 కిలోగ్రాముల వరకు మాత్రమే లగేజీని తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది.
ఆటోల్లో ఉండే డిజిటల్ మీటర్లను నూతన రేట్లకు అనుగుణంగా మార్చడానికి రవాణా శాఖ ఆటో డ్రైవర్లు మరియు యజమానులకు సమయం ఇచ్చింది. ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి 3 నెలల వ్యవధిలో డిజిటల్ మీటర్లను కొత్త టారిఫ్‌కు అనుగుణంగా రీసెట్ చేసుకోవాలని రవాణా శాఖ కమిషనర్ స్పష్టం చేశారు.
{{/usCountry}}ఆటోల్లో ఉండే డిజిటల్ మీటర్లను నూతన రేట్లకు అనుగుణంగా మార్చడానికి రవాణా శాఖ ఆటో డ్రైవర్లు మరియు యజమానులకు సమయం ఇచ్చింది. ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి 3 నెలల వ్యవధిలో డిజిటల్ మీటర్లను కొత్త టారిఫ్‌కు అనుగుణంగా రీసెట్ చేసుకోవాలని రవాణా శాఖ కమిషనర్ స్పష్టం చేశారు.
{{/usCountry}}ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ఆమోదించిన కొత్త టారిఫ్ కార్డును ప్రయాణికులకు స్పష్టంగా కనిపించేలా ఆటోలో ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది. మీటర్‌లో తొలి 1.6 కిలోమీటర్లకు రూ. 30 నమోదు అయ్యేలా… ఆ తర్వాత ప్రతీ 100 మీటర్లకు రూ. 1.40 చొప్పున పెరిగేలా డిజిటల్ మీటర్ల మైక్రోచిప్‌లను రీసెట్ చేయాల్సి ఉంటుంది.