తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో ఖాళీగా ఉన్న డ్రైవర్, శ్రామిక్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ఈ పోస్టుల తుది ఎంపిక జాబితాను అధికారికంగా ప్రకటించింది.

సెప్టెంబర్ 17, 2025న జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,743 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించారు. డ్రైవింగ్ టెస్ట్ మార్కులు, వెయిటేజీ మార్కులు, విద్యార్హతలు, వయోపరిమితి సడలింపులు, రిజర్వేషన్ ఆధారంగా మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో నిర్వహించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్(ఏప్రిల్ 23 - జూన్ 25, 2026) అనంతరం ఈ ఎంపికలు పూర్తి చేసినట్లు బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు తెలిపారు.
మొత్తం ప్రకటన చేసిన 1,743 పోస్టులకు గాను అర్హులైన అభ్యర్థుల లభ్యత ఆధారంగా 1,604 మందిని ఎంపిక చేశారు. నిబంధనలకు అనుగుణంగా అర్హులైన అభ్యర్థులు లభించకపోవడం వల్ల 139 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి.
డ్రైవర్ 1,000 పోస్టులకు గానూ.. 894 పోస్టులు పూర్తి చేశారు. శ్రామిక్ పోస్టులకు పురుషులు 694, మహిళలు 16 మంది సెలక్ట్ అయ్యారు. ఎంపికైన అభ్యర్థుల ఫలితాలు, డ్రైవింగ్ టెస్ట్ మార్కుల షీట్లను బోర్డు అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in లో అందుబాటులో ఉంచారు.
అభ్యర్థులు తమ లాగిన్ వివరాల ద్వారా ఎంపిక జాబితాని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రతీ క్యాటగిరీకి సంబంధించిన కట్-ఆఫ్ మార్కులు మరియు అభ్యర్థి పుట్టిన తేదీ వివరాలను వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
{{/usCountry}}ప్రతీ క్యాటగిరీకి సంబంధించిన కట్-ఆఫ్ మార్కులు మరియు అభ్యర్థి పుట్టిన తేదీ వివరాలను వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
{{/usCountry}}ఎంపికైన అభ్యర్థులకు క్యారెక్టర్, యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ (పోలీస్ వెరిఫికేషన్), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా నియామక ఉత్తర్వులు ఇస్తారు. ఈ ప్రక్రియ కోసం అభ్యర్థులు క్రింది నిబంధనలను పాటించాలి.
ఆగస్టు 7, 2026 (శుక్రవారం) ఉదయం 8 గంటల నుండి ఆగస్టు 11, 2026 (మంగళవారం) అర్ధరాత్రి వరకు బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండే ‘అటెస్టేషన్ ఫారమ్’ ను ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలి.
ఆన్‌లైన్‌లో నింపిన అటెస్టేషన్ ఫారమ్ పీడీఎఫ్‌ను 3 సెట్లు ఏ4 సైజ్ కాగితాలపై స్పష్టంగా ప్రింట్ తీయాలి.
నిర్దేశిత ప్రదేశాల్లో అభ్యర్థి సంతకం చేయాలి.
ప్రతీ సెట్‌పై నిర్ణీత స్థలాల్లో 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను అంటించాలి.
గెజిటెడ్ ఆఫీసర్‌తో (Gazetted Officer) సంతకం/అటెస్టేషన్ చేయించాలి.
పూర్తి చేసిన 3 సెట్ల అటెస్టేషన్ ఫారమ్‌లను దానికి సంబంధించిన జిరాక్స్ సర్టిఫికేట్లతో కలిపి ఆగస్టు 17, 2026 (సోమవారం) నాడు సమర్పించాలి. అటెస్టేషన్ ఫారమ్‌పై సూచించిన విధంగా ఆయా ఉమ్మడి జిల్లాల పోలీస్ కార్యాలయాలు లేదా కమిషనరేట్లలో సమర్పించాల్సి ఉంటుంది.