TGSRTC : టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్, శ్రామిక్ పోస్టుల ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేయాలి?

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు.. టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్, శ్రామిక్ పోస్టుల సెలక్షన్ లిస్ట్ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు ఎలా చూడాలో తెలుసుకోండి.

Published on: Aug 3, 2026, 19:17:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో ఖాళీగా ఉన్న డ్రైవర్, శ్రామిక్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ఈ పోస్టుల తుది ఎంపిక జాబితాను అధికారికంగా ప్రకటించింది.

టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్, శ్రామిక్ పోస్టుల ఫలితాలు విడుదల
టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్, శ్రామిక్ పోస్టుల ఫలితాలు విడుదల

సెప్టెంబర్ 17, 2025న జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,743 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించారు. డ్రైవింగ్ టెస్ట్ మార్కులు, వెయిటేజీ మార్కులు, విద్యార్హతలు, వయోపరిమితి సడలింపులు, రిజర్వేషన్ ఆధారంగా మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో నిర్వహించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్(ఏప్రిల్ 23 - జూన్ 25, 2026) అనంతరం ఈ ఎంపికలు పూర్తి చేసినట్లు బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు తెలిపారు.

మొత్తం ప్రకటన చేసిన 1,743 పోస్టులకు గాను అర్హులైన అభ్యర్థుల లభ్యత ఆధారంగా 1,604 మందిని ఎంపిక చేశారు. నిబంధనలకు అనుగుణంగా అర్హులైన అభ్యర్థులు లభించకపోవడం వల్ల 139 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి.

డ్రైవర్ 1,000 పోస్టులకు గానూ.. 894 పోస్టులు పూర్తి చేశారు. శ్రామిక్ పోస్టులకు పురుషులు 694, మహిళలు 16 మంది సెలక్ట్ అయ్యారు. ఎంపికైన అభ్యర్థుల ఫలితాలు, డ్రైవింగ్ టెస్ట్ మార్కుల షీట్లను బోర్డు అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in లో అందుబాటులో ఉంచారు.

అభ్యర్థులు తమ లాగిన్ వివరాల ద్వారా ఎంపిక జాబితాని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రతీ క్యాటగిరీకి సంబంధించిన కట్-ఆఫ్ మార్కులు మరియు అభ్యర్థి పుట్టిన తేదీ వివరాలను వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ఎంపికైన అభ్యర్థులకు క్యారెక్టర్, యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ (పోలీస్ వెరిఫికేషన్), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా నియామక ఉత్తర్వులు ఇస్తారు. ఈ ప్రక్రియ కోసం అభ్యర్థులు క్రింది నిబంధనలను పాటించాలి.

ఆగస్టు 7, 2026 (శుక్రవారం) ఉదయం 8 గంటల నుండి ఆగస్టు 11, 2026 (మంగళవారం) అర్ధరాత్రి వరకు బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండే ‘అటెస్టేషన్ ఫారమ్’ ను ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలి.

ఆన్‌లైన్‌లో నింపిన అటెస్టేషన్ ఫారమ్ పీడీఎఫ్‌ను 3 సెట్లు ఏ4 సైజ్ కాగితాలపై స్పష్టంగా ప్రింట్ తీయాలి.

నిర్దేశిత ప్రదేశాల్లో అభ్యర్థి సంతకం చేయాలి.

ప్రతీ సెట్‌పై నిర్ణీత స్థలాల్లో 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను అంటించాలి.

గెజిటెడ్ ఆఫీసర్‌తో (Gazetted Officer) సంతకం/అటెస్టేషన్ చేయించాలి.

పూర్తి చేసిన 3 సెట్ల అటెస్టేషన్ ఫారమ్‌లను దానికి సంబంధించిన జిరాక్స్ సర్టిఫికేట్లతో కలిపి ఆగస్టు 17, 2026 (సోమవారం) నాడు సమర్పించాలి. అటెస్టేషన్ ఫారమ్‌పై సూచించిన విధంగా ఆయా ఉమ్మడి జిల్లాల పోలీస్ కార్యాలయాలు లేదా కమిషనరేట్లలో సమర్పించాల్సి ఉంటుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More