...
...
Next Story

తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా? మరోసారి ఏజ్ లిమిట్ పెంపు

Telangana Police Jobs Age Limit : పోలీస్ ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరోసారి వయసు పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Updated on: Sep 9, 2026, 22:41:59 IST
Advertisement

తెలంగాణలో యూనిఫామ్ ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పోలీస్, ఫైర్, జైళ్లు, ప్రత్యేక రక్షణ దళం (SPF) విభాగాలలో కానిస్టేబుల్ తదితర సమాన స్థాయి పోస్టుల ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని మరో 3 ఏళ్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీవో ఎంఎస్ నంబర్ 129ను జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ పేరుతో ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి.

తెలంగాణ పోలీస్ ఉద్యోగాల వయసు పరిమితి పెంపు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల వయసు పరిమితి పెంపు

గతంలో జీవో ఎంఎస్ నంబర్ 122 ద్వారా ప్రభుత్వం కానిస్టేబుల్ పోస్టులకు 7 ఏళ్ల వయోపరిమితి సడలింపునిచ్చింది. అయితే, పోలీసు శాఖలోని సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 32 ఏళ్లు కాగా, కానిస్టేబుల్ పోస్టులకు 29 ఏళ్లుగా ఉండటంతో రెండింటి మధ్య 3 ఏళ్ల వ్యత్యాసం ఏర్పడింది. ఈ తేడా వల్ల ఎంతోమంది అర్హులైన అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

ఈ విషయాన్ని నిరుద్యోగులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పాత జీవో ప్రకారం ఇచ్చిన 7 ఏళ్లకు అదనంగా మరో 3 ఏళ్ల సడలింపు ఇస్తూ తాజా జీవో ఇచ్చింది. దీనివల్ల సాధారణ పరిమితి కంటే మొత్తం 10 ఏళ్ల వరకు అదనపు వయోపరిమితి లభించనుంది.

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ద్వారా చేపట్టే ప్రత్యక్ష నియామకాలకు ఈ నూతన సడలింపు నిబంధనలు వర్తిస్తాయి. పోలీస్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) విభాగాలలోని కానిస్టేబుల్, ఆ సమాన స్థాయి క్యాడర్ పోస్టులకు వర్తిస్తుంది. పోలీస్ శాఖలోని పీసీ డ్రైవర్ పోస్టులకు మాత్రం ఈ అదనపు సడలింపు వర్తించదు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks