Special Trains : సెప్టెంబర్‌లో ఈ రూట్‌లలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రత్యేక రైళ్లు.. స్టాప్‌లు ఇవే

Festival Special Trains : దక్షిణ మధ్య రైల్వే ఆంధ్రప్రదేశ్-తెలంగాణ నడుమ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు కీలక రూట్‌లలో నడుస్తుండటంతో ప్యాసింజర్లకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది.

Published on: Sep 9, 2026, 19:01:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. చర్లపల్లి-కాకినాడ, చర్లపల్లి-తిరుచానూరు, గుంటూరు-వికారాబాద్ నడుమ ఈ ట్రైన్స్ నడుస్తాయి. ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్‌ను ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నడుపుతునన్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్లు

ప్రత్యేక రైళ్లు

రైలు నెం.07039/07040 చర్లపల్లి - కాకినాడ టౌన్ - చర్లపల్లి ప్రత్యేక రైళ్లు (4 సర్వీసులు) సెప్టెంబర్ 11, 12 13, 14వ తేదీల్లో నడుస్తాయి. అటువైపు రెండు, ఇటు వైపు రెండు సర్వీసులు.. మెుత్తం నాలుగుగా ప్లాన్ చేశారు. ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

రైలు నం. 07025/07026 చర్లపల్లి – తిరుచానూరు – చర్లపల్లి ప్రత్యేక రైళ్లు (2 సర్వీసులు) సెప్టెంబర్ 11,12వ తేదీల్లో ఉన్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులాలోనూ నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

ట్రైన్ నం. 07227/07228 గుంటూరు - వికారాబాద్ - గుంటూరు ప్రత్యేక రైళ్లు (2 సర్వీసులు) సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో ఉన్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడే, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట మరియు లింగంపల్లిలో రెండు వైపులా ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

నవంబర్, డిసెంబర్ నెలల్లో వేర్వేరు తేదీల్లో బయలుదేరే ఈ సర్వీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో స్పష్టం చేసింది.

చర్లపల్లి- గోరఖ్‌పూర్ రైలు దారి మళ్లింపు

రైలు నంబరు - 22075 చర్లపల్లి – గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 2026 నవంబర్ 20, 27 తేదీలతో పాటు, డిసెంబర్ 4, 11, 18, 25 తేదీలలో బయలుదేరే సర్వీసులు క్రమబద్ధీకరించిన పాత మార్గానికి బదులుగా ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్తాయి. ప్రత్యామ్నాయ మార్గం ప్రకారం ఇటార్సి - జబల్‌పూర్ - హమీర్‌పూర్ రోడ్ - కాన్పూర్ సెంట్రల్ మీదుగా ఈ రైలు నడుస్తుంది.

రైలు నంబరు: 22076 గోరఖ్‌పూర్ – చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ తిరుగు ప్రయాణంలో గోరఖ్‌పూర్ నుంచి చర్లపల్లికి వచ్చే ఈ రైలు 2026 నవంబర్ 22, 29 తేదీలతో పాటు, డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో బయలుదేరే సర్వీసులను దారి మళ్లిస్తారు . ప్రత్యామ్నాయ మార్గం.. కాన్పూర్ సెంట్రల్ - హమీర్‌పూర్ రోడ్ - జబల్‌పూర్ - ఇటార్సి మీదుగా ఈ రైలు చర్లపల్లి చేరుకుంటుంది.

ఈ రెండు మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులు దారి మళ్లించిన తేదీలు, రూట్ల సమాచారాన్ని తెలుసుకోవాలి. రైళ్ల రాకపోకల సమయాలను గమనించి తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More