తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల విజ్ఞప్తులు దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(TSLPRB) విడుదల చేసిన నూతన ప్రకటన ప్రకారం, అభ్యర్థులు సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. నియామక ప్రకటన ప్రకారం తొలుత సెప్టెంబర్ 9వ తేదీని చివరి తేదీగా నిర్ణయించినప్పటికీ, తాజాగా ఆ గడువును మరో వారం రోజుల పాటు పొడిగించారు.
టీఎస్‌ఎల్‌ఆర్‌బీ జులై 29న విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7,437 పోస్టులను భర్తీ చేయనుంది. ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
పోలీస్ కానిస్టేబుల్ (సివిల్): 3,697 పోస్టులు
పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్ - AR): 1,052 పోస్టులు
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) కానిస్టేబుల్: 1,380 పోస్టులు
ఫైర్ ఫైటర్ (తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ సర్వీసెస్): 751 పోస్టులు
జైలు వార్డర్ (తెలంగాణ జైళ్ల శాఖ): 208 పోస్టులు
పోలీస్ కానిస్టేబుల్ (SAR CPL - పురుషులు): 24 పోస్టులు
పోలీసు నియామక ప్రక్రియకు అభ్యర్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. మొత్తం 3,38,336 మంది అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ప్రాథమిక రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు. వీరిలో 2,88,530 మంది నిర్ణీత ఫీజు చెల్లించి, దరఖాస్తు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.
నియామక ప్రక్రియలో పారదర్శకత కోసం నిర్వహిస్తున్న ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ ఇప్పటికే 95 శాతానికి పైగా పూర్తయినట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు స్పష్టం చేసింది.
{{/usCountry}}నియామక ప్రక్రియలో పారదర్శకత కోసం నిర్వహిస్తున్న ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ ఇప్పటికే 95 శాతానికి పైగా పూర్తయినట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు స్పష్టం చేసింది.
{{/usCountry}}గడువు పెరిగినప్పటికీ, అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడవద్దని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అలర్ట్ చేసింది. చివరి రోజుల్లో సర్వర్లపై తీవ్ర ఒత్తిడి పెరిగి సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున, అర్హత కలిగిన అభ్యర్థులు వీలైనంత త్వరగా తమ దరఖాస్తు ప్రక్రియను, ఫీజు చెల్లింపును పూర్తి చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులు మరింత సమాచారం, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం అధికారిక వెబ్‌సైట్ tslprb.in ను సందర్శించవచ్చు.
సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి పోస్టులకు తెలంగాణ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750, ఇతర అభ్యర్థులందరికీ (ఓసీ/బీసీ) రూ.1,500గా ఫీజు ఉంది. పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైలు వార్డెన్ పోస్టులు అప్లై చేసే తెలంగాణ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600, ఇతర అభ్యర్థులందరికీ రూ.1,200గా ఫీజు నిర్ణయించారు.
ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు. ఆ పరీక్ష ఫలితాలనే వారు దరఖాస్తు చేసుకున్న అన్ని పోస్టులకూ పరిగణనలోకి తీసుకుంటారు.