మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో పసుపు రికార్డు స్థాయి ధరతో రైతులకు ఆనందాన్ని ఇచ్చింది. చాలాకాలంగా ఆశించిన స్థాయిలో మద్దతు ధర రాక నిరాశ చెందిన కర్షకులకు పెరిగిన ధరలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. సోమవారం జరిగిన ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్(ఈ-నామ్) ఇ-వేలంలో పసుపు క్వింటా గరిష్ఠంగా రూ.19,253 పలికి కేసముద్రం మార్కెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

ఇటీవల పసుపు సీజన్ ప్రారంభంలో క్వింటా ధర రూ.12,000 దగ్గరే అటు ఇటు తిరిగింది. క్రమంగా రూ.16,000 వరకు పెరిగినప్పటికీ, ఈ నెల 22న నిర్వహించిన క్రయవిక్రయాల్లో క్వింటా గరిష్ఠ ధర రూ.13,319 వద్దే ఆగింది. అయితే రెండు రోజులు సెలవుల తర్వాత సోమవారం మార్కెట్‌కు వచ్చిన పసుపు నాణ్యత చాలా బాగుండడంతో వ్యాపారులు పోటీపడి మరీ కొనుగోలు చేశారు. ఫలితంగా కేవలం ఒక్క రోజు తేడాలోనే క్వింటాపై రూ.5,000 నుంచి రూ.6,000 వరకు ధర పెరగడం విశేషం. ఈ వేలంలో పాల్గొన్న రైతులు తీసుకువచ్చిన కాడి రకం, గోళ రకం పసుపు ఉత్పత్తులకు లభించిన ధరల వివరాలు.. చూస్తే..
కాడి రకం పసుపు
వచ్చిన సరుకు: 7గురు రైతులు – 69 బస్తాలు, గరిష్ఠ ధర: రూ. 19,253, కనిష్ఠ ధర: రూ. 15,589, సగటు ధర: రూ. 19,252.
గోళ రకం పసుపు
వచ్చిన సరుకు: 3గురు రైతులు – 30 బస్తాలు, గరిష్ఠ ధర: రూ. 18,566, కనిష్ఠ ధర: రూ. 8,506, సగటు ధర: రూ. 17,469.
మొత్తంగా సోమవారం మార్కెట్‌కు 99 బస్తాల పాత పసుపు నిల్వలు రాగా.. అంతటా ఊహించని రీతిలో రికార్డు ధర పలికింది. గతంతో పోలిస్తే ధరల గ్రాఫ్.. ఈ నెల 16న కాడి రకం గరిష్ఠం రూ. 11,609, కనిష్ఠం రూ. 7,011. అదే గోళ రకం గరిష్ఠం రూ. 10,511, కనిష్ఠంగా రూ.7011గా పలికింది. ఈ నెల 22న గరిష్ఠంగా రూ. 13,319 ధర పలికింది. సోమవారం ఒకేసారి రూ. 19,253కు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది.
కేసముద్రం మార్కెట్లో అమలు చేస్తున్న ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ (e-NAM) ఈ-వేలం విధానం ద్వారా రైతులకు సరైన న్యాయం జరుగుతోంది. వ్యాపారులు పారదర్శకంగా ఆన్లైన్లో బిడ్డింగ్ దాఖలు చేయడం, ఈసారి మార్కెట్‌కు వచ్చిన పసుపులో తేమ శాతం తక్కువగా ఉండి నాణ్యతా ప్రమాణాలు గరిష్ఠంగా ఉండడంతో వ్యాపారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
{{/usCountry}}కేసముద్రం మార్కెట్లో అమలు చేస్తున్న ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ (e-NAM) ఈ-వేలం విధానం ద్వారా రైతులకు సరైన న్యాయం జరుగుతోంది. వ్యాపారులు పారదర్శకంగా ఆన్లైన్లో బిడ్డింగ్ దాఖలు చేయడం, ఈసారి మార్కెట్‌కు వచ్చిన పసుపులో తేమ శాతం తక్కువగా ఉండి నాణ్యతా ప్రమాణాలు గరిష్ఠంగా ఉండడంతో వ్యాపారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
{{/usCountry}}పసుపు ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు చూసుకుంటే.. మార్కెట్‌కు వచ్చిన పాత పసుపు సరుకు మంచి రంగు, నాణ్యత కలిగి ఉండడం. దేశీయ మార్కెట్లలో, ఎగుమతి వ్యాపారులలో పసుపునకు డిమాండ్ ఒక్కసారిగా పెరగడం కూడా దీనికి కారణంగా చెప్పవచ్చు. మార్కెట్‌కు సరకు తక్కువగా ఉండటం వల్ల కొనుగోలుదారులు ఎక్కువ ధరకు కొంటున్నారు.
కేసముద్రం మార్కెట్ చరిత్రలోనే పసుపు పంటకు ఈ స్థాయిలో క్వింటా రూ. 19 వేలకు పైగా లభించడం ఇదే తొలిసారని మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు. మార్కెట్‌లో మెరుగైన ధర రావడంతో రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధమైన నాణ్యతతో పంటను తీసుకువస్తే మంచి ధరలు పొందే అవకాశం ఉందని అధికారులు రైతులకు సూచిస్తున్నారు.