ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో ట్విస్ట్.. సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ పార్టీకి షాక్!
తెలంగాణలో కొంతకాలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై చర్చ నడుస్తోంది. అయితే తాజాగా ఈ కేసుపై విచారణను సుప్రీం కోర్టు ముగించింది.
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై సుప్రీం కోర్టు విచారణను ముగించింది. బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. BRS పార్టీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ డిస్పోజ్ చేసింది.

ఈ కేసు విచారణ సమయంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి.. దాఖలైన పిటిషన్లపై స్పీకర్ ఇప్పటికే విచారణ చేసి.. తగిన నిర్ణయం తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. పిటిషన్లను స్పీకర్ కార్యాలయం పరిష్కరించిందని ధర్మాసనానికి వెల్లడించారు.
అభిషేక్ మను సింఘ్వీ వాదనలతో జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించింది. స్పీకర్ ఇప్పటికే ఈ వ్యవహారం తీసుకున్నందున.. ఇక మీద ఈ పిటిషన్లపై విచారణ కొనసాగించాల్సిన అవరసం లేదని ముగించింది. అంతేకాదు.. రెండు రోజుల్లో తీర్పు కాపీలను ఫిర్యాదుదారులకు అసెంబ్లీ స్పీకర్ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీలు మారినట్టుగా ఆధారాలు లేవని స్పష్టం చేశారు. వీరిద్దరిపై అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. మరోవైపు ఈ పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టులో గురువారం విచారణ జరగనుంది.
ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని తీర్పులో స్పీకర్ వెల్లడించారు. సుప్రీంకోర్టులో విచారణకు ముందే స్పీకర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న పది మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు.
ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేల్లో తెల్లం వెంకట్‌రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, అరికెపూడి గాంధీ, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్‌కుమార్, దానం నాగేందర్, కడియం శ్రీహరి ఉన్నారు. తాజాగా సుప్రీం కోర్టు కూడా స్పీకర్ నిర్ణయం తీసుకున్నందున విచారణ చేయాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలినట్టైంది.
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని, 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ నేతలు పిటిషన్‌ను దాఖలు చేశారు. స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు కొన్ని రోజుల కిందట విచారించింది. స్పీకర్ మీద సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా? మేం తీసుకోవాలా ? అని తెలంగాణ స్పీకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


