హైదరాబాద్ నగర శివార్లలోని నాదర్గుల్ సమీపంలో ఉన్న ఎంవీఎస్ఆర్ (MVSR) ఇంజినీరింగ్ కళాశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన దండియా వేడుకల సమయంలో ప్రమాదం జరిగింది. ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన భారీ లైటింగ్ పోళ్లు ఒక్కసారిగా విద్యార్థులపై కూలిపడ్డాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా…. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

మృతుల్లో ఒకరిని వనపర్తికి చెందిన సోనిగా అధికారులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన సోని సోదరి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో ఆమెను తక్షణ వైద్య సాయం కోసం మెరుగైన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా…. వారిని ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. దసరా ఉత్సవాల సందర్భంగా ఎంవీఎస్ఆర్ కళాశాల మైదానంలో విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంతో దండియా నృత్యాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా భారీ లైటింగ్ స్తంభాలు విద్యార్థుల గుంపుపైకి కూలిపడ్డాయి. ఈ హఠాత్ పరిణామంతో అక్కడ ఉన్న విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే కాలేజీ యాజమాన్యం, స్థానికులు స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. లైటింగ్ పోళ్ల ఏర్పాటులో నిర్లక్ష్యం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక కొన్ని వీడియోలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి.
చర్యలకు సీఎం ఆదేశాలు…
కళాశాల ప్రాంగణంలో చోటుచేసుకున్న ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దండియా వేడుకలు జరుగుతున్న సమయంలో లైటింగ్ పోళ్లు కూలిపడి విద్యార్థి మృతి చెందిన ఉదంతం తనను ఎంతగానో కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ అకస్మాత్తు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి కుటుంబ సభ్యులకు సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలని, సంఘటనకు బాధ్యులైన వారిని తక్షణమే గుర్తించాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులు ఎంతటివారైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
{{/usCountry}}కళాశాల ప్రాంగణంలో చోటుచేసుకున్న ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దండియా వేడుకలు జరుగుతున్న సమయంలో లైటింగ్ పోళ్లు కూలిపడి విద్యార్థి మృతి చెందిన ఉదంతం తనను ఎంతగానో కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ అకస్మాత్తు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి కుటుంబ సభ్యులకు సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలని, సంఘటనకు బాధ్యులైన వారిని తక్షణమే గుర్తించాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులు ఎంతటివారైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
{{/usCountry}}