మరణం అంటే ప్రతీ ఒక్కరికీ భయమే. చావు తమ దగ్గరకు రాకూడదని అందరూ కోరుకుంటారు. చివరకు చేరాల్సింది చావు దగ్గరకే అనే విషయం తెలిసినా.. దానిని జీర్ణించుకోలేరు, చావు అనే సత్యాన్ని ఆలోచించినా భయపడుతుంటారు. అనంత విశ్వంలో ప్రతి ప్రాణీ ఊపిరి కలిసిపోవాల్సిందే. ఇదే విషయాన్ని జగిత్యాల జిల్లాలోని 80 ఏళ్ల వృద్ధుడు అర్థం చేసుకున్నాడు.

చావును ప్రశాంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. జగిత్యాల గ్రామీణ మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఆరోగ్యంగానే ఉన్న ఆ వృద్ధుడు తన సొంత సమాధిని నిర్మించుకోవడానికి రూ.12 లక్షలు ఖర్చు చేసి చాలా మందిని ఆశ్చర్యపరిచాడు.
నక్కా ఇంద్రయ్యగా అనే వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం సమాధిని నిర్మించారు. దానిని బాధతో చూడకుండా.. తన భవిష్యత్ విశ్రాంతి స్థలందా చెబుతారు. చివరకు చేరాల్సిందే అక్కడికేనని జీవిత సత్యాన్ని వివరిస్తారు. క్రమం తప్పకుండా సమాధిని సందర్శిస్తారు. చివరకు చేరాల్సిన స్థలం దగ్గర ప్రశాంతత ఉండాలని కోరుకుంటున్నారు ఇంద్రయ్య.
ఇంద్రయ్య సాధారణ నిర్మాణాన్ని ఎంచుకోలేదు. అధిక నాణ్యత గల పాలరాయిని ఉపయోగించి, తన భార్య సమాధి పక్కన చక్కగా సమాధిని నిర్మించుకున్నారు. చావు తర్వాత కూడా తన భార్యకు పక్కనే ఉండాలని కోరుకుంటున్నట్టుగా ఇంద్రయ్య చెప్పుకొచ్చారు.
శ్మశాన వాటికల అంటేనే, అటుగా వెళ్లాలి అంటేనే దూరంగా ఉండే చాలా మంది వ్యక్తుల మాదిరిగా కాకుండా.. ఇంద్రయ్య తన సమాధి నిర్మించిన ప్రదేశాన్ని ఒక విశ్రాంతి స్థలంగా భావిస్తాడు. పరిసరాలను శుభ్రం చేయడానికి, పాలరాయిని ఊడ్చి రావడానికి, సమీపంలో నాటిన చెట్లకు నీళ్ళు పోయడానికి, కొంతసేపు హాయిగా కూర్చోవడానికి ఇంద్రయ్య ప్రతిరోజూ సమాధి దగ్గరకు వెళ్తాడు.
తన నిర్ణయం గురించి మాట్లాడుతూ.. తనకు సమాధిని చూస్తే.. భయం కంటే సంతృప్తిగా ఉందని అన్నారు. చిన్నతనంలో వృత్తిరీత్యా బిల్డర్ అయిన ఇంద్రయ్య సమాధిని తన చివరి ప్రాజెక్ట్‌గా అభివర్ణించారు. 'నేను ఈ గ్రామంలో ఇళ్ళు, ఒక పాఠశాల, ఒక చర్చిని నిర్మించాను. ఇప్పుడు నేను నా స్వంత సమాధిని నిర్మించుకున్నాను. అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది.' అని ఇంద్రయ్య అన్నారు.
{{/usCountry}}తన నిర్ణయం గురించి మాట్లాడుతూ.. తనకు సమాధిని చూస్తే.. భయం కంటే సంతృప్తిగా ఉందని అన్నారు. చిన్నతనంలో వృత్తిరీత్యా బిల్డర్ అయిన ఇంద్రయ్య సమాధిని తన చివరి ప్రాజెక్ట్‌గా అభివర్ణించారు. 'నేను ఈ గ్రామంలో ఇళ్ళు, ఒక పాఠశాల, ఒక చర్చిని నిర్మించాను. ఇప్పుడు నేను నా స్వంత సమాధిని నిర్మించుకున్నాను. అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది.' అని ఇంద్రయ్య అన్నారు.
{{/usCountry}}చాలామంది సమాధులను చూసి దుఃఖంతో బాధపడుతున్నప్పటికీ.. మానవ జీవితంలోని అనివార్య వాస్తవం అదేనని ఇంద్రయ్య చెబుతున్నారు. చివరికి ఏదీ నిజంగా ఎవరికీ చెందదని అంటున్నారు. లక్ష్మీపురం, సమీప గ్రామాల ప్రజలు ఇంద్రయ్య సమాధి గురించి తరచూ చర్చించుకుంటారు. ఆరోగ్యంగా ఉండగానే మరణం వస్తుందని అంగీకరించడం ద్వారా దాని చుట్టూ ఉన్న భయం నుండి తనను తాను విముక్తి చేసుకున్నానని నమ్ముతాడు ఇంద్రయ్య. చావు భయం లేకుండా బతకడం అంటే నిజంగా ఇది గ్రేట్ కదా..!