చివరకు చేరేది అక్కడికే.. బతికుండగానే రూ.12 లక్షలతో సమాధి కట్టుకున్న 80 ఏళ్ల వ్యక్తి
ఏ జీవి అయినా చివరికి చేరాల్సింది చావు దగ్గరికే. పుట్టుక, చావుకు మించిన సత్యం మరొకటి లేదు. ఈ విషయాన్ని బలంగా నమ్మాడు 80 ఏళ్ల వ్యక్తి. బతికుండగానే తన కోసం సమాధి కట్టించుకున్నాడు.
మరణం అంటే ప్రతీ ఒక్కరికీ భయమే. చావు తమ దగ్గరకు రాకూడదని అందరూ కోరుకుంటారు. చివరకు చేరాల్సింది చావు దగ్గరకే అనే విషయం తెలిసినా.. దానిని జీర్ణించుకోలేరు, చావు అనే సత్యాన్ని ఆలోచించినా భయపడుతుంటారు. అనంత విశ్వంలో ప్రతి ప్రాణీ ఊపిరి కలిసిపోవాల్సిందే. ఇదే విషయాన్ని జగిత్యాల జిల్లాలోని 80 ఏళ్ల వృద్ధుడు అర్థం చేసుకున్నాడు.

చావును ప్రశాంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. జగిత్యాల గ్రామీణ మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఆరోగ్యంగానే ఉన్న ఆ వృద్ధుడు తన సొంత సమాధిని నిర్మించుకోవడానికి రూ.12 లక్షలు ఖర్చు చేసి చాలా మందిని ఆశ్చర్యపరిచాడు.
నక్కా ఇంద్రయ్యగా అనే వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం సమాధిని నిర్మించారు. దానిని బాధతో చూడకుండా.. తన భవిష్యత్ విశ్రాంతి స్థలందా చెబుతారు. చివరకు చేరాల్సిందే అక్కడికేనని జీవిత సత్యాన్ని వివరిస్తారు. క్రమం తప్పకుండా సమాధిని సందర్శిస్తారు. చివరకు చేరాల్సిన స్థలం దగ్గర ప్రశాంతత ఉండాలని కోరుకుంటున్నారు ఇంద్రయ్య.
ఇంద్రయ్య సాధారణ నిర్మాణాన్ని ఎంచుకోలేదు. అధిక నాణ్యత గల పాలరాయిని ఉపయోగించి, తన భార్య సమాధి పక్కన చక్కగా సమాధిని నిర్మించుకున్నారు. చావు తర్వాత కూడా తన భార్యకు పక్కనే ఉండాలని కోరుకుంటున్నట్టుగా ఇంద్రయ్య చెప్పుకొచ్చారు.
శ్మశాన వాటికల అంటేనే, అటుగా వెళ్లాలి అంటేనే దూరంగా ఉండే చాలా మంది వ్యక్తుల మాదిరిగా కాకుండా.. ఇంద్రయ్య తన సమాధి నిర్మించిన ప్రదేశాన్ని ఒక విశ్రాంతి స్థలంగా భావిస్తాడు. పరిసరాలను శుభ్రం చేయడానికి, పాలరాయిని ఊడ్చి రావడానికి, సమీపంలో నాటిన చెట్లకు నీళ్ళు పోయడానికి, కొంతసేపు హాయిగా కూర్చోవడానికి ఇంద్రయ్య ప్రతిరోజూ సమాధి దగ్గరకు వెళ్తాడు.
తన నిర్ణయం గురించి మాట్లాడుతూ.. తనకు సమాధిని చూస్తే.. భయం కంటే సంతృప్తిగా ఉందని అన్నారు. చిన్నతనంలో వృత్తిరీత్యా బిల్డర్ అయిన ఇంద్రయ్య సమాధిని తన చివరి ప్రాజెక్ట్‌గా అభివర్ణించారు. 'నేను ఈ గ్రామంలో ఇళ్ళు, ఒక పాఠశాల, ఒక చర్చిని నిర్మించాను. ఇప్పుడు నేను నా స్వంత సమాధిని నిర్మించుకున్నాను. అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది.' అని ఇంద్రయ్య అన్నారు.
చాలామంది సమాధులను చూసి దుఃఖంతో బాధపడుతున్నప్పటికీ.. మానవ జీవితంలోని అనివార్య వాస్తవం అదేనని ఇంద్రయ్య చెబుతున్నారు. చివరికి ఏదీ నిజంగా ఎవరికీ చెందదని అంటున్నారు. లక్ష్మీపురం, సమీప గ్రామాల ప్రజలు ఇంద్రయ్య సమాధి గురించి తరచూ చర్చించుకుంటారు. ఆరోగ్యంగా ఉండగానే మరణం వస్తుందని అంగీకరించడం ద్వారా దాని చుట్టూ ఉన్న భయం నుండి తనను తాను విముక్తి చేసుకున్నానని నమ్ముతాడు ఇంద్రయ్య. చావు భయం లేకుండా బతకడం అంటే నిజంగా ఇది గ్రేట్ కదా..!
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


