...
...
Next Story

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పీహెచ్‌డీ అడ్మిషన్స్.. అప్లికేషన్‌కు లాస్ట్ డేట్ ఇదే

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పీహెచ్‌డీ అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Feb 25, 2026, 18:23:41 IST
Advertisement

హైదరాబాద్ విశ్వవిద్యాలయం జనవరి 2026 అడ్మిషన్ సైకిల్ కింద 13 పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తులను ఆహ్వానించింది. బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. చెల్లుబాటు అయ్యే యూజీసీ నెట్ స్కోర్‌లు ఉన్న అభ్యర్థులు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పీహెచ్‌డీ అడ్మిషన్స్
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పీహెచ్‌డీ అడ్మిషన్స్

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మెుత్తం 13 పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానించింది. బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేయడానికి జనవరి 2026 అడ్మిషన్లకు ఇది పొడిగింపు నోటిఫికేషన్‌గా పేర్కొంది. UGC-NET/CSIR-UGC-NET స్కోర్‌లతో అర్హత కలిగిన అభ్యర్థులు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ http://acad.uohyd.ac.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రోగ్రామ్‌లు, అర్హత, ఫీజులు, రిజర్వేషన్ విధానం, ప్రాస్పెక్టస్ 2025-26 వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

పాక్షికంగా సమర్పించిన దరఖాస్తు ఫారాలు, FORMNUMBER లేని దరఖాస్తులు తిరస్కరిస్తారు. దరఖాస్తు రుసుము చెల్లించకుండా, ఫారమ్ నంబర్ లేకుండా అప్లై చేయలేరు. ఒకసారి చెల్లించిన రుసుము తిరిగి చెల్లించరు.

ముఖ్యమైన తేదీలు

  • ప్రవేశ ప్రకటన విడుదల - 24/02/2026
  • ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభం- 24/02/2026
  • ఆన్‌లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ - 10/03/2026
  • ఇంటర్వ్యూ కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా నోటిఫికేషన్- 16/03/2026
  • ఇంటర్వ్యూలు (హైబ్రిడ్ మోడ్)-23/03/2026, 24/02/2026
  • వెబ్‌సైట్‌లో ఎంపికైన/వెయిట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితా నోటిఫికేషన్ - 31/03/2026
  • అడ్మిషన్ కౌన్సెలింగ్- 06/04/2026
  • తరగతుల ప్రారంభం - తెలియజేస్తారు.

ఇంటర్వ్యూ, కౌన్సెలింగ్ కోసం షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురిస్తారు. ప్రవేశానికి పిలిచిన అభ్యర్థుల జాబితా విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో మాత్రమే ఉంటుమది. అభ్యర్థులు ఫలితాలు, ప్రవేశానికి అవసరమైన సంబంధిత ఫార్మాట్‌ల కోసం విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ను చెక్ చేయవచ్చు. ఈ విషయంలో అభ్యర్థులకు ఎటువంటి వ్యక్తిగత సందేశం పంపరు.

http://acad.uohyd.ac.in/downloads/phdhelp26jan.pdf ఈ యూఆర్ఎల్ ద్వారా మీరు ఎలా అప్లై చేయాలో తెలుసుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks