యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో రిక్రూట్‌మెంట్.. ఇంటర్వ్యూతో జాబ్, మంచి జీతం!
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్వ్యూ ద్వారా జాబ్ పొందవచ్చు.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 25వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. సెంటర్ ఫర్ సైకాలజీ, స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో తాత్కాలిక గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

సైకాలజీలో స్పెషలైజేషన్ ఉండాలి. సైకాలజీలో PhD లేదా UGC NET సైకాలజీ (సైకాలజీలో మాస్టర్స్ స్థాయిలో కనీసం 55 శాతం మార్కులతో, స్థిరంగా మంచి విద్యా రికార్డుతో ఉండాలి.) బోధనలో అనుభవం కావాలి. అర్హత కలిగిన అభ్యర్థులను హైబ్రిడ్ ( అంటే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్‌లో) ఇంటర్వ్యూకు పిలుస్తారు. అభ్యర్థులు వారి స్వంత ఖర్చుతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
ఎంపికైన అభ్యర్థులు జనవరి-మే 2026 వింటర్ సెమిస్టర్ తిరిగి ప్రారంభమైన తేదీ నుండి వారంలోపు విశ్వవిద్యాలయంలో చేరాలి. ఈ పోస్టు నియామకం పూర్తిగా తాత్కాలికమైనది. శీతాకాల సెమిస్టర్ 2026 (జనవరి-మే 2026) కోసం ఉంటుంది. జీతాలు యూజీసీ మార్గదర్శకాల ప్రకారం అందిస్తారు.
విద్యా అర్హతలు, పని అనుభవం వివరాలతో జనవరి 25వ తేదీలోపు అప్లికేషన్ పంపాలి. అర్హత కలిగిన అభ్యర్థులకు జనవరి 31, 2026 నాటికి ఇంటర్వ్యూ గురించి తెలియజేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ జరిగే స్థలం వివరాలు, ఇతర ముఖ్యమైన సమాచారం ఇంటర్వ్యూకు ముందు షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు పంపిస్తారు. ఓబీసీ సర్టిఫికెట్‌లను ప్రస్తుత నిబంధనల ప్రకారం సూచించిన ఫార్మాట్‌లో సమర్పించాలి. ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థి ఒరిజినల్ పత్రాలు పరిశీలిస్తారు. జీతం 50 వేల వరకు ఉంటుంది.
దరఖాస్తులను ఈ క్రింది చిరునామాకు పంపాలి
హెడ్, సెంటర్ ఫర్ సైకాలజీ, స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ప్రొఫెసర్ సి. ఆర్. రావు రోడ్, గచ్చిబౌలి,
హైదరాబాద్- 500046. తెలంగాణ
ఇమెయిల్: headpsychologyuoh@uohyd.ac.in, కార్యాలయ టెలిఫోన్: 23134790
ఇమెయిల్ ద్వారా ముందస్తు కాపీగా పంపిన దరఖాస్తులను తప్పనిసరిగా స్పీడ్ పోస్ట్/కొరియర్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ 25-01-2026గా గుర్తుంచుకోండి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


