...
...
Next Story

TGSRTC Unlimited Bus Travel : రూ.600కే వారం రోజులు టీజీఎస్ఆర్టీసీ అన్‌లిమిటెడ్ బస్ ట్రావెల్

TGSRTC Unlimited Bus Travel : టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. క్యూర్ పరిధిలోని ప్రయాణికులకు తక్కువ ధరకే వీక్లీ పాస్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Published on: Oct 25, 2026, 16:20:38 IST
Advertisement

హైదరాబాద్ నగర ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మరో అద్భుతమైన న్యూస్ అందించింది. రోజువారీ ఉద్యోగులు, విద్యార్థులు, అలాగే వ్యాపార పనుల నిమిత్తం క్యూర్ పరిధిలో నిత్యం ప్రయాణించే పౌరుల జేబులకు భారం తగ్గించేలా రూ.600లకే వారం రోజుల పాటూ అపరిమిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

టీజీఎస్ఆర్టీసీ వీక్లీ పాస్
టీజీఎస్ఆర్టీసీ వీక్లీ పాస్

నగర రవాణాను మరింత సులభతరం, బడ్జెట్ ఫ్రెండ్లీగా మార్చడమే లక్ష్యంగా టీజీఎస్ఆర్టీసీ అధికారులు ఈ కొత్త వీక్లీ పాస్ పథకానికి రూపకల్పన చేశారు.

ఈ పాస్ కొనుగోలు చేసిన తేదీ నుంచి సరిగ్గా వరుసగా 7 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు. ఇందులో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డిలక్స్ మాత్రమే కాకుండా ఏసీ బస్సులలో కూడా అపరిమితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు.

ఈ ప్రత్యేక వీక్లీ పాస్ కేవలం శంషాబాద్ విమానాశ్రయానికి నడిచే పుష్పక్ ఎయిర్‌పోర్ట్ లైనర్ సర్వీసులకు మాత్రం వర్తించదని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. నగరంలోని ప్రధాన బస్ స్టేషన్లు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని సిటీ బస్ పాస్ కౌంటర్లలోనూ ఈ వీక్లీ పాస్‌లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐటీ ఉద్యోగులు, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు, రోజువారీ వ్యాపారులు వేర్వేరు రూట్లలో ప్రయాణించాల్సి వస్తుంది. రోజువారీ టికెట్ల ఖర్చు, చిల్లర సమస్యలు లేదా సింగిల్ డే ప్రయాణ పాస్‌ల కంటే ఈ వీక్లీ పాస్ ఎంతో లాభదాయకంగా మారనుంది. రోజూ ఏసీ బస్సుల్లో ప్రయాణించేవారికి ఈ రూ.600 ప్యాకేజీ ఆర్థికంగా పెద్ద ఊరట నిస్తుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

ఇక క్యూర్ పరిధిలో ప్రయాణించేవారు.. రూ.600 వీక్లీ పాస్ తీసుకుంటే.. 7 రోజులు ఎంచక్కా తిరిగేయెుచ్చు. ఈజీ, బడ్జెట్ ఫ్రెండ్లీ సిటీ బస్సు ప్రయాణం కోసం దీనిని తీసుకొచ్చారు. ఏసీ బస్సుల్లో కూడా అపరిమితంగా ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించడం విశేషం. క్యూర్ పరిధిలోని అన్ని సిటీ బస్ పాస్ కౌంటర్లలో ఈ వీక్లీ పాస్ అందుబాటులో ఉంటుంది. కావాల్సినవారు వెళ్లి తీసుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks