Indiramma Indlu : క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్లు.. ఈ నెల 20న శ్రీకారం!

Indiramma Indlu : ఈ నెల 20న క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇండ్లకు శ్రీకారం చుట్టనుంది ప్రభుత్వం. దశలవారీగా లక్ష ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా నియోజకవర్గానికి వెయ్యి ఇండ్ల వరకు నిర్మిస్తారు.

Published on: Jul 15, 2026, 05:36:34 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రామీణ ప్రాంతాలల్లో ఇందిరమ్మ ఇండ్లతో పెద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజా ప్రభుత్వం ఇప్పుడు అదే సంకల్పంతో క్యూర్ పరిధిలోని పేదల సొంతింటి స్వప్నాన్ని నిజం చేసేందుకు మరో చారిత్రాత్మక అడుగు వేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో దశల వారీగా లక్ష ఎల్.ఐ.జి. ఇందిరమ్మ ఇండ్లను నిర్మించబోతున్నామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పరిపాలన అనుమతులు కూడా ఇవ్వడం జరిగిందన్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

సచివాలయంలోని తన కార్యాలయం క్యూర్ పరిధిలో ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇండ్లపై హౌసింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇండ్ల పథకానికి శ్రీకారం చూడుతున్నామని ప్రకటించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ జిల్లా మంత్రి మహ్మద్ అజారుద్దీన్‌తో కలిసి పథకానికి సంబంధించిన విదివిధానాలను, దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు, టెండర్ల ప్రక్రియ, అమలు విధానం తదితర పూర్తి మార్గదర్శకాలను ప్రకటిస్తామని వివరించారు.

2026-27 ఆర్థిక సంవత్సరంలో క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి చెప్పారు. తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గానికి కనీసం 500 చొప్పున ఆయా స్థానిక పరిస్థితులనుబట్టి అవసరమైన చోట వెయ్యి వరకు నిర్మిస్తామని తెలిపారు.

గత ప్రభుత్వం ఎలాంటి ముందుచూపు లేకుండా, హైదరాబాద్ నగరానికి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో అరకొరగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించడంవల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోతామనే ఆందోళనతో చాలామంది అక్కడ నివసించలేకపోయారని పొంగులేటి అన్నారు.

తమ ప్రభుత్వం మాత్రం పేదల జీవన వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే, ఉపాధి, పిల్లల విద్య, వైద్య సౌకర్యాలు, రవాణా వంటి అంశాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకొని అత్యంత ముఖ్యమైన ప్రాంతాలల్లో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లను నిర్మిస్తున్నామని పొంగులేటి స్పష్టం చేశారు. ఆ స్థలములో వారికి వాటా ఇస్తూ యాజమాన్య హక్కు కల్పిస్తూ వారి కుటుంబాలకు శాశ్వత ఆర్థిక భద్రతను కల్పిస్తున్నామన్నారు.

క్యూర్ పరిధిలో హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నియోజకవర్గాలల్లో స్థలాలను గుర్తించడం జరిగిందని, ఈ స్థలాలను ఇప్పటికే హౌసింగ్ విభాగం పొజిషన్ లోకి తీసుకుందన్నారు. ఎక్కడ ఎన్ని ఇండ్లు, ఎన్ని అంతస్తులు నిర్మించాలి, ఒక్కో ప్లాట్ విస్తీర్ణం, బిల్డింగ్ డిజైన్ లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి రెండు, మూడు రోజులల్లో తుది రూపును ఇస్తామని వెల్లడించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More