PRC : తెలంగాణలో పర్మినెంట్ రెసిడెన్సీ సర్టిఫికేట్.. ఆలోచనలో ప్రభుత్వం!
Permanent Residence Certificate : కర్ణాటక రాష్ట్రం తరహాలోనే తెలంగాణలో పర్మినెంట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ విషయంపై చర్చ జరగనుంది.
తెలంగాణలో కర్ణాటక రాష్ట్రం తరహాలో శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం(Permanent Residence Certificate - PRC) విధానాన్ని ప్రవేశపెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోందని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ వెల్లడించారు. ఈ కొత్త విధానం సాధ్యసాధ్యాలను సమగ్రంగా పరిశీలించడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో దీర్ఘకాలంగా నివసిస్తున్న ప్రజలు తమ శాశ్వత నివాసాన్ని సులభంగా నిరూపించుకోవడానికి వీలుగా ఒక ప్రామాణిక ప్రభుత్వ పత్రాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షబ్బీర్ అలీ వినతిపత్రం సమర్పించారు.
షబ్బీర్ అలీ అందించిన ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో ప్రాథమికంగా చర్చించారు. కర్ణాటకలో అమలులో ఉన్న పి.ఆర్.సి విధానాన్ని, దాని ఫ్రేమ్‌వర్క్‌ను అధ్యయనం చేసి తెలంగాణలో కూడా అలాంటి వ్యవస్థను తీసుకురావడానికి ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఓటర్ల వెరిఫికేషన్ సమయంలో పరిశీలించదగిన పత్రాల జాబితాలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం కూడా ఒకటని షబ్బీర్ అలీ గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తి పరిశీలన తర్వాత అధికారికంగా జారీ చేసే పి.ఆర్.సి, ఓటర్లు తమ అర్హతను నిరూపించుకోవడానికి ఒక బలమైన మద్దతు పత్రంగా ఉపయోగపడుతుందని వివరించారు.
ఈ కొత్త నివాస ధ్రువీకరణ పత్రం వస్తే చాలా ప్రయోజనకరంగా ఉండనుంది. 2002 నాటికి ఓటు హక్కు వయసు లేని వారికి ఇది నివాస ఆధారంగా మారుతుంది. వివాహం తర్వాత పేర్లు, చిరునామాలు మారిన మహిళలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఒక నియోజకవర్గం లేదా జిల్లా నుండి మరొక ప్రాంతానికి మారిన కుటుంబాలకు నివాస ధ్రువీకరణ సులువవుతుంది. పాత రికార్డులలో పేర్ల స్పెల్లింగులు లేదా అనువాద లోపాల వల్ల తమ వివరాలను కనుగొనలేకపోతున్న నివాసితులకు ఈ పత్రం ద్వారా మేలు జరుగుతుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


