KVs Recruitment 2026 : ఉప్పల్ కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్ ఉద్యోగాలు - కేవలం ఇంటర్వ్యూతోనే భర్తీ..!
ఉప్పల్ కేంద్రీయ విద్యాలయం నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. నంబర్ 1, నంబర్ 2 పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను పార్ట్-టైమ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ లో ఉన్న పీఎం కేంద్రీయ విద్యాలయం నంబర్ 1, నంబర్ 2 నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. పార్ట్ టైమ్ ప్రాతిపదిన టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను నియమించుకోనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఈనెల 19న ఇంటర్వ్వూలు…
ఈ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అభ్యర్థి విద్యా అర్హతలతో పాటు పని చేసిన అనుభవాన్ని పరగణనలోకి తీసుకుంటారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 19వ తేదీన నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
రామాంతపూర్ రోడ్డ వైపు ఉన్న పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం వేదికగా టీజీటీ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయి. వీటిల్లో ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్) ఉన్నాయి. తెలుగు టీచర్ (రీజినల్ లాంగ్వేజ్), కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, డ్యాన్స్ కోచ్, వోకేషనల్ ఇన్‌స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్ (అథ్లెటిక్స్/కబడ్డీ/ఖో-ఖో/ తైక్వాండో), యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టులున్నాయి. ఉదయం 9 నుంచి 10 వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.
ఉప్పల్ లో ఉన్న మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉంటే కేంద్రీయ విద్యాలయం వేదికగా పీజీటీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 10 వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.
ఈ పోస్టులకు హాజరయ్యే అభ్యర్థులు ఆయా విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. సీటెట్ అర్హత తప్పనిసరి. హిందీ, ఇంగ్లీష్ మీడియాల్లో బోధించగల సామర్థ్యం ఉండాలి. ఇందుకు సంబంధించిన పూర్తి అర్హతలను https://no1uppal.kvs.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి తెలుసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ కూడా ఇదే వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. పోస్టును బట్టి జీతం ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

