భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, సాంకేతిక సరఫరా వ్యవస్థలను మరింత భద్రపరచుకునేందుకు కీలక అడుగు పడింది. హైదరాబాద్‌లోని చారిత్రాత్మక తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ కలసి అగ్రశ్రేణి భారతీయ పారిశ్రామికవేత్తలతో ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.

అమెరికా స్వాతంత్య్ర 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ రాత్రి భోజన సమావేశంలో రక్షణ పరికరాల తయారీ, సెమీకండక్టర్లు, ఫార్మాస్యూటికల్స్, సమాచార సాంకేతిక రంగాలకు చెందిన ప్రతినిధులు, సీఈఓలు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో రెండు దేశాల వ్యూహాత్మక విధానాలను ప్రత్యక్ష వ్యాపార పెట్టుబడులుగా మార్చడమే లక్ష్యంగా ఈ భేటీ సాగింది.
సాంకేతికత, రక్షణ రంగాల్లో భాగస్వామ్యం
ఇరు దేశాల మధ్య నెలకొన్న అపూర్వమైన ద్వైపాక్షిక పురోగతిని ఈ సందర్భంగా అమెరికా రాయబారి సెర్గియో గోర్ నొక్కి చెప్పారు. "అమెరికా, భారత్ సుదీర్ఘకాలంగా వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి. కేవలం ఒక వ్యూహానికే పరిమితం కాకుండా ఈ ద్వైపాక్షిక భాగస్వామ్యం ఎంత సుదూరం పయనించిందో ఇలాంటి వేదికలే నిదర్శనం. నేడు రక్షణ, సాంకేతికత, లైఫ్ సైన్సెస్, వ్యోమగామి రంగా వ్యాపారాలకు ఇది ఒక బలమైన నిర్మాణంగా మారింది. ఈ గదిలో ఉన్న మీరందరూ కుదుర్చుకున్న ఒక్కో వ్యాపార ఒప్పందంతోనే ఈ పటిష్టమైన బంధం రూపుదిద్దుకుంది" అని సెర్గియో గోర్ పేర్కొన్నారు.
దక్షిణాది రాష్ట్రాలకు సరికొత్త అవకాశాలు
రెండు దేశాల మధ్య మౌలిక మార్కెట్ ప్రాప్యతను విస్తరించడం, రక్షణ పారిశ్రామిక రంగానికి ఊతమివ్వడమే ధ్యేయంగా ఇరు వర్గాలు చర్చలు జరిపాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలోని పారిశ్రామిక దిగ్గజాలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రాయబారి పిలుపునిచ్చారు.
ట్రస్ట్ (TRUST) ఇనిషియేటివ్, పాక్స్ సిలికా, యుఎస్-ఇండియా కాంపాక్ట్, వ్యూహాత్మక ఖనిజాల పునరుద్ధరణ ఇనిషియేటివ్ వంటి విధానపరమైన చట్రాలను ఉపయోగించుకోవడం ద్వారా సరఫరా వ్యవస్థ భాగస్వామ్యం, విదేశీ పెట్టుబడులు మరింత ఊపందుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
{{/usCountry}}ట్రస్ట్ (TRUST) ఇనిషియేటివ్, పాక్స్ సిలికా, యుఎస్-ఇండియా కాంపాక్ట్, వ్యూహాత్మక ఖనిజాల పునరుద్ధరణ ఇనిషియేటివ్ వంటి విధానపరమైన చట్రాలను ఉపయోగించుకోవడం ద్వారా సరఫరా వ్యవస్థ భాగస్వామ్యం, విదేశీ పెట్టుబడులు మరింత ఊపందుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
{{/usCountry}}