...
...
Next Story

వాస్క్యులార్ ఎండోవ్యాస్క్యులర్ సర్జన్స్ అవగాహన కార్యక్రమం.. పాల్గొన్న నటుడు రాజీవ్ కనకాల!

వాస్క్యులార్ ఎండోవ్యాస్క్యులర్ సర్జన్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా క్రికెట్ లీగ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరు అరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా నటుడు రాజీవ్ కనకాల చెప్పారు.

Published on: Apr 05, 2026 06:18 PM IST
Advertisement

తెలంగాణ సొసైటీ ఆఫ్ వాస్క్యులార్ అండ్ ఎండోవ్యాస్క్యులార్ సర్జన్స్ ఆధ్వర్యంలో డివిటి(డీప్ వీన్ థ్రాంబోసిస్), పీఎఫ్ (ఫల్మనరీ ఎంబోలిజం) కాళ్ల నరాల్లో సమస్యలపై అవగాహన కల్పిస్తూ క్రికెట్ లీగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరవ్యాప్తంగా ఉన్న వ్యాస్క్యులార్ సర్జన్స్ కలిసి ఏర్పాటుచేసిన తెలంగాణ సొసైటీ ఆఫ్ వ్యాస్క్యులార్ అండ్ ఎండోవాస్క్యులార్ సర్జన్స్ ఆధ్వర్యంలో ఆదివారం మణికొండలోని లేక్సైడ్ లీగ్ స్పోర్ట్స్ క్యాఫే వద్ద అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.

వాస్క్యులార్ ఎండోవ్యాస్క్యులర్ సర్జన్స్ అవగాహన కార్యక్రమం
వాస్క్యులార్ ఎండోవ్యాస్క్యులర్ సర్జన్స్ అవగాహన కార్యక్రమం

ప్రతి ఒక్కరూ రోజు శారీరక వాయామం ఉండాలని, కాళ్లల్లో వాపులు, నరాల్లో బ్లడ్ క్లాట్స్ వంటి సమస్యలు తలెత్తితే వెంటనే వ్యాస్క్యులార్ సర్జన్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోవాలని తెలియజేస్తూ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి సినీ నటుడు రాజీవ్ కనకాల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డాక్టర్లతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా రాజీవ్ కనకాల మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, డీవీటీ అండ్ పీఎఫ్ సమస్య తీవ్రమైందన్నారు.

ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కాళ్లను కోల్పోవాల్సి ఉంటుందని, ప్రాథమిక దశలోనే డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో వ్యాస్క్యులార్ సర్జన్లు డాక్టర్ పంజాల రామకృష్ణ, డాక్టర్ ప్రేమ్ చంద్ గుప్తా, డాక్టర్ నిషాన్ రెడ్డి, డాక్టర్ దేవేందర్ సింగ్, డాక్టర్ వసంత్ రెడ్డి, డాక్టర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ నీహార్ రంజన్ ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భాగంగా ట్రోఫిని అందజేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe