...
...
Next Story

RTC Driver Suicide : నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి

Telangana RTC Strike : తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిరసనలో భాగంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందారు.

Published on: Apr 24, 2026, 05:27:16 IST
Advertisement

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తోంది. బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు చాలా చోట్ల నిరసనలు చేపడుతున్నారు. అయితే నిరసనలో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కోలా శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ.. నర్సంపేట బస్టాండ్ ఎదుట శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే ఆయనను వరంగల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి హైదరాబాద్‌ తీసుకొచ్చారు. 80 శాతానికి పైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శంకర్ గౌడ్ చనిపోయారు.

ప్రాణాలు తీసుకోవద్దు : సీఎం రేవంత్

కేబినెట్ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడారు. "కార్మికులు ఎవరూ తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దు.. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కావు" అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని, ప్రతి కార్మికుడి శ్రేయస్సు తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని మంత్రులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం కార్మికులతో ముఖాముఖి భేటీ కానుంది.

మరోవైపు, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తగ్గేదే లేదని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఈయూ ఆఫీసులో సమావేశమైన జేఏసీ నేతలు వెంకన్న, థామస్‌రెడ్డి షెడ్యూల్‌ను విడుదల చేశారు:

25న: డిపోల్లోనే 'వంటా-వార్పు'.

26న: జిల్లాల వారీగా 'కార్మిక కవాతు'.

27న: ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు.. మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో 'బతుకమ్మ నిరసన'.

29న: డిపోల ముందు 'అర్ధనగ్న ప్రదర్శనలు'.

ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం ఒక సానుకూల పరిణామం అయితే.. జేఏసీ ప్రకటించిన వరుస నిరసనలు ఉత్కంఠను రేపుతున్నాయి. మంత్రుల కమిటీ చర్చల తర్వాత ఆర్టీసీలో సమ్మె నీడలు తొలగిపోతాయా? లేదా నిరసనలు మరింత కొనసాగుతాయా? అన్నది వేచి చూడాలి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe