నవంబర్ 26న హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం!
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నవంబర్ 26న నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ మేరకు వాటర్ బోర్డు అధికారులు వెల్లడించారు.
భాగ్యనగరవాసులకు వాటర్ బోర్డు అధికారులు అలర్ట్ ఇచ్చారు. విద్యుత్ మరమ్మతుల పనుల కారణంగా కృష్ణా జిల్లాల పంపింగ్‌ను ఆరు గంటలు నిలిపివేస్తున్నట్టుగా అధికారులు వెల్లడించారు. ఈ నెల 26వ తేదీన కృష్ణా జలాలు బంద్ చేయనున్నట్టుగా వాటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. దీంతో పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

విద్యుత్ మరమ్మతుల కారణంగా 6 గంటలపాటు కృష్ణా జలాల పంపింగ్ ఆగిపోతుంది. కృష్ణా ఫేజ్-i, ii, iii పంపింగ్ స్టేషన్లకు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేసే బల్క్ ఫీడర్ల నిర్వహణ చేస్తున్నారు అధికారులు. అంతేకాదు.. దెబ్బతిన్న కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్స్ అమర్చనున్నారు.
ఈ కారణంగా నాగర్జున సాగర్ సమీపంలోని నాసర్లపల్లి పంపింగ్ స్టేషన్స్ దగ్గర ఉన్న 132 కేవీ సబ్‌స్టేషన్లకు బుధవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల దాకా విద్యుత్ అంతరాయం ఏర్పడుంది. మరమ్మతుల కారణంగా సరఫరా నిలిపివేస్తారు అధికారులు.
వినయ్‌నగర్, చార్మినార్, బోజగుట్ట, రెడ్‌హిల్స్, నారాయణగూడ, ఎస్ఆర్ నగర్, మారేడ్‌పల్లి, రియాసత్‌నగర్, సాహెబ్‌నగర్, కూకట్‌పల్లి, హయత్‌నగర్, సైనిక్‌పురి, ఉప్పల్, హఫీజ్‌పేట్, రాజేంద్రనగర్, మణికొండ, బోడుప్పల్, మీర్‌పేట్ డివిజన్ ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. దీనికి అనుగుణంగా ప్రజలు ప్లాన్ చేసుకోవాలని వాటర్ బోర్డు అధికారులు వెల్లడించారు.
డివిజన్ల వారీగా దీని ప్రభావం మారుతూ ఉంటుందని, అనేక ప్రాంతాలు సమస్యను ఎదుర్కొనే అవకాశం లేదా ఆ రోజు సరఫరా ఉండకపోవచ్చని HMWSSB తెలిపింది. హైదరాబాద్ వాసులు ముందుగానే నీటిని నిల్వ చేసుకోవాలని బోర్డు సూచించింది. సాధారణ సరఫరా తిరిగి ప్రారంభమయ్యే వరకు ప్రభావిత ప్రాంతాలలోని నివాసితులు తగినంత నీరు ఉండేలా చూసుకుని ఇబ్బందులను దూరుం చేసుకోవాలని అధికారులు కోరారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


