...
...
Next Story

ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలుకు సాయం చేస్తాం.. సమ్మెపై స్పందించిన మంత్రి పొన్నం

తెలంగాణలో ఆటోల సమ్మెకు డ్రైవర్లు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆటోల బంద్ సరికాదని పేర్కొన్నారు.

Published on: Aug 23, 2026, 14:57:20 IST
Advertisement

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరంలో పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజా పాలనలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రూ.20 లక్షలతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రజలు, రైతులు, మహిళా సంఘాల సమస్యలను నేరుగా తెలుసుకుని, పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

మంత్రి పొన్నం ప్రభాకర్
మంత్రి పొన్నం ప్రభాకర్

శనిగరం గ్రామానికి 46 ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా కింద రూ.1.57 కోట్లు, రైతు రుణమాఫీ కింద రూ.4.54 కోట్లు, గృహజ్యోతి కింద 997 కుటుంబాలకు ఉచిత విద్యుత్ ప్రయోజనం అందించినట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గ్రామంలోని అత్యవసరమైన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి, శనిగరం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయిల్‌పామ్ సాగు, జలసిరి, స్టీల్ బ్యాంకులు, మహిళా సంఘాల బలోపేతం, విద్యార్థులకు క్రీడా ప్రోత్సాహం వంటి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పిల్లివాగు బ్రిడ్జి నిర్మాణానికి రూ.17 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి, త్వరలో మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటోల సమ్మెకు కార్మిక సంఘం నేతలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. సమ్మె నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2015 తర్వాత ఆటో ఛార్జీలు పెంచలేదని, పెరిగిన ఖర్చులు పరిగణనలోకి తీసుకుని ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ వేస్తామన్నారు. ఇందులోపల ఆటో కార్మికుల ప్రతినిధులు, రవాణా అధికారులను భాగస్వామ్యం చేస్తామన్నారు. అన్ని అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

తెలంగాణలో ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ రవాణా రంగ కార్మికులు తమ నిరసన గళాన్ని విప్పారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ఆటోరిక్షా డ్రైవర్ల యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. ఈ సమ్మెకు భారతీయ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ కూడా తన పూర్తి మద్దతును తెలిపింది.

ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆటో డ్రైవర్లకు ఏడాదికి ప్రకటించిన రూ. 12,000 ఆర్థిక సాయాన్ని, పాత బాకీలతో సహా వెంటనే ఖాతాల్లో జమ చేయాలన్నారు. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కోసం ప్రకటించిన రూ. 5 లక్షల ఉచిత ప్రమాద భీమా పథకాన్ని పునరుద్ధరించి, సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.

యాప్ ఆధారిత చట్టవిరుద్ధ బైక్ టాక్సీ సేవలపై తక్షణమే నిషేధం విధించాలన్నారు జేఏసీ నేతలు. ఆయా కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రభుత్వమే ఒక అధికారిక యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగినందున దానికి అనుగుణంగా ఆటో, క్యాబ్ మీటర్ ఛార్జీలను పెంచాలన్నారు. కార్మికులకు కనీస ఆదాయం లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe