Telangana Weather : మరికొన్ని గంటలు వర్షం.. హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ
తెలంగాణలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. మరికొన్ని గంటలు కూడా ఇలాగే పలు ప్రాంతాల్లో వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఓ వైపు ఎండలు మెుదలవుతున్నాయనుకుంటుంటే.. మరోవైపు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వరుణుడు పలకరించాడు. రాష్ట్రంలో మరికొన్ని గంటలు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే హైదరాబాద్, మేడ్చల్‌లో వర్షం పడింది.

మరికొన్ని గంటలు హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, కాచిగూడతోపాటుగా కొన్ని ప్రదేశాల్లో వర్షం పడింది. ఇక మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.
తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాలు, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది.
సోమవారం సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డిలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, సంగారెడ్డిలో వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. రాబోయే రెండు గంటల్లో కరీంనగర్, నిజామాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలలో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
ఏపీలో వాతావరణ పరిస్థితి
ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు గోదావరిలో మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు, మెరుపులు వర్షాలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రైతులు చెట్ల కింద నిలబడవద్దని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు.
ఫిబ్రవరి 23, 2026న ఉదయం 8.30 గంటలకు మధ్య బంగాళాఖాతంలోని నైరుతి, పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగింది. బంగాళాఖాతంలో అల్పపీడన వ్యవస్థలు ఏర్పడుతున్నాయి. ఒకటి బలపడి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇది 2-3 రోజులు చురుగ్గా ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


